మామ నాగార్జునను పట్టించుకోని సమంత

పీకల్లోతూ ప్రేమలో మునిగిన టాలీవుడ్ జంట నాగచైతన్య-సమంత నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. సమంత పెళ్లి దగ్గర పడుతుండడంతో ఆ తర్వాత సినిమాల్లో నటించడం వీలవుతుందో లేదోనని సమంత తెలుగు, తమిళంలో ఒప్పుకున్న సినిమాలను వేగంగా కంప్లీట్ చేస్తోంది.

తెలుగులో రాంచరణ్ హీరోగా రంగస్థలంలో నటిస్తోంది. తమిళంలో అగ్రహీరోలతో సినిమా చేస్తోంది. ఈ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ సమంత కావడంతో ఆ సినిమాలపైనే సమంత దృష్టిపెట్టిందట.దీంతో మామ నాగార్జున తన సినిమాలోని గెస్ట్ పాత్రలో నటించమని కోరినా కూడా సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట.. దీంతో సమంతపై నాగార్జున గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాజుగారి గది2’. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది. అయితే సినిమాలో కీలకమైన రాణి పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా కొద్ది సేపు గెస్ట్ పాత్ర ఉంటుందట.. ఇందులో సమంత నటించాల్సి ఉంది. మామ నాగార్జున సినిమా కావడంతో సమంత ఇందులో గెస్ట్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. కానీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినా ఇప్పటివరకు రాజుగారి గది2 సినిమాకు సమంత డేట్స్ ఇవ్వలేదట..పెళ్లికి ముందు సినిమాలు కంప్లీట్ చేయాలని చూస్తున్న సమంత.. తన మామ నాగార్జున సినిమాను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

To Top

Send this to a friend