‘నిన్ను కోరి’ మిస్‌ అయిన సమంత!

నాని హీరోగా నివేదా థామస్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. ఈ చిత్రంలో నాని పాత్రతో పాటు నివేదా థామస్‌ పాత్రకు మంచి పేరు వచ్చింది. అద్బుత నటనతో నివేదా థామస్‌ ఆకట్టుకుందనే టాక్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంతో నివేదా థామస్‌ క్రేజ్‌ మరింతగా పెరిగింది. నటిగా మరో మెట్టును నివేదా ఎక్కిందని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రాన్ని నిర్మించిన కోన వెంకట్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్‌ను సంప్రదించానని, కాని ఆమె నానితో నటించేందుకు ఒప్పుకోలేదు, బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు తాను ఈ చిత్రాన్ని చేయలేను అంటూ చెప్పుకొచ్చిందని కోన చెప్పుకొచ్చాడు. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పలేదు. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతను కోన సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

ఇంతకు ముందే నానికి జోడీగా సమంత రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరినప్పుడు మాత్రం ఆమె బిజీ షెడ్యూల్‌తో పాటు ఇతరత్ర కారణాలు చెప్పిందట. అయితే ఈ సినిమా సమంత చేస్తే బాగుండేది అని మాత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నటిగా సమంత తనను తాను నిరూపించుకునేది అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

To Top

Send this to a friend