ఆర్ఎస్ఎస్ మాటతో హిందూ రాజ్యం చేస్తాడా.?


భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం.. నాటి గాంధీ నుంచి నేటి మన్మోహన్ సింగ్ వరకు లౌకిక వాదిగా ఉంటూనే దేశంలోని మత సమగ్రతను కాపాడారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఎజెండా లౌకికత్వమే.. కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ భావాలు పెరిగిపోతున్నాయి. గోవధ నిషేధం బీజేపీ గద్దెనెక్కిన రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. క్రైస్తవాన్ని స్వీకరిస్తున్న దళితులపై ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. హిందుత్వ బ్రాండ్లన్నీ తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ హయాంలో ఊసే లేని పతంజలి లాంటి ఉత్పత్తులు, గురువులు, బాబాలు ఇప్పుడు తెరమీదకు వచ్చి ఔషధాలు, హిందూ భావజాలాన్ని వ్యాపింపచేస్తున్నారు..

*యూపీ పీఠంపై ఆర్ఎస్ఎస్ గురువే
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఓక మఠాదిపతిని, పైగా హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్న ఓ కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ నేతను చేయడం వివాదాస్పదమైంది. మోడీ లౌకికవాదిని.. సౌమ్యుడిని చేయాలని అనుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ జోక్యంతో యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. నిజానికి ఈ మఠాధిపతిని సీఎం చేయడానికి ఆర్ఎస్ఎస్ తీవ్ర ఒత్తిడి తెచ్చిందట.. ఆయన ద్వారా యూపీలో రామమందిరం నిర్మాణం సహా పెండింగ్ లో ఉన్న చాలా హిందుత్వ కార్యక్రమాలను పూర్తి చేయాలని మఠాధిపతిని సీఎం చేసినట్టు తెలిసింది. యోగి ఆదిత్యనాథ్ గద్దెనెక్కడంతో యూపీలో 20శాతం ఉన్న ముస్లిం మైనార్టీల్లో ఇప్పుడు గుబులు పుడుతోంది..

*హిందుత్వ రాజ్యస్థాపన.. మోడీ కీలుబొమ్మ
దేశాన్ని ఏకచత్రాధిపత్యంలో ఏలుతున్న మోడీ కూడా ఆర్ఎస్ఎస్ ముందు తలవంచుతున్నాడు. బీజేపీ ని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చినా.. యూపీలో గల్లీగల్లీ తిరిగి గద్దెనెక్కించినా.. ఆయన తన మనసుకు నచ్చిన వారిని యూపీ సీఎం పీఠంపై కూర్చుండబెట్టలేకపోయారు. ఆర్ఎస్ఎస్ ఎంపికే చేసిన హిందుత్వవాదినే సీఎం చేశారు. ఈ విషయంలో మోడీ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారాడనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దేశంలో ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తోంది. గురువులు, మఠాధిపతులు ఆదిపత్యం పెరుగుతోంది. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ కలకు మోడీకి సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదట అతిపెద్ద రాష్ట్రం యూపీలో పంతం నెగ్గించుకున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశమంతా అదే ఫార్ములాను ప్రయోగించబోతోంది. ఇదే జరిగితే పక్కన తాము ముస్లిం దేశం అని ప్రకటించుకున్న పాకిస్తాన్ వలే.. మనమూ భారత్ ను హిందూ దేశం అని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

To Top

Send this to a friend