నాన్న బాటలో.. రోజా హోంమంత్రి..

 

ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీని సంస్కరించి ఎన్నికల బరిలో నిలిపేందుకు సన్నాహాలు మొదలు పెట్టడంతో వైసీపీలో సందడి, సమరోత్సాహం నెలకొంది. అక్టోబర్ 27 నుంచి జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టడం.. వైసీపీ నాయకులు కార్యచరణ సిద్ధం చేస్తుండడంతో నాయకులందరూ హుషారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 2019 ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే జగన్ సీఎం అయితే పార్టీలో మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయి.. ఎవరూ కీరోల్ పోషిస్తారనే చర్చ వైసీపీ నాయకుల్లో వచ్చిందట.. ఈ సందర్భంగా జగన్ కు ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా నాన్న రాజశేఖర్ రెడ్డి బాటలోనే పయనించబోతున్నాడనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది..

దివంగత ముఖ్య మంత్రి వైఎస్ బాటలో నడుస్తున్న జగన్.. అందుకనుగుణంగానే తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఏపీ సీఎం అయ్యాక హోంమంత్రిగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన సబితా ఇంద్రారెడ్డిని నియమించారు. మహిళ కావడం.. రక్షణ విషయంలో శ్రద్ధ చూపడంతో సబిత సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే ఫార్ములా కనుక అప్లై చేస్తే జగన్.. ఫైర్ బ్రాండ్ రోజాకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రోజా హోంమంత్రిగా, జగన్ సీఎంగా ఉంటే ప్రభుత్వం ఇద్దరు బలమైన నాయకుల చేతుల్లో పటిష్టంగా ఉంటుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదీ ఏమైనా.. వైసీపీ నాయకుల్లో అప్పుడే విజయకాంక్ష బలపడిపోయింది. గెలవకముందే మంత్రివర్గ కూర్పు, ఎవరికీ ఏ పదవులు అనే చర్చ సాగుతోంది. వైసీపీ నాయకులందరూ ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.

To Top

Send this to a friend