రోబో 2.0 ఎంట్రీ.. బాహుబలియే టార్గెట్..

భారత దేశ సినిమా అంటే ఇప్పుడు బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అనే స్థాయిలో క్రేజ్ నెలకొంది. దేశవ్యాప్తంగా హిందీ సినిమాలే పరమావధి అనుకుంటున్న సమయంలో తెలుగులోంచి రాజమౌళి చెక్కిన బాహుబలి శిల్పం దేశ సినిమా చరిత్రలోనే రికార్డులన్నీ బద్దలుకొట్టి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు బాహుబలి టార్గెట్ గా మరో దక్షిణాది మూవీ దేశవ్యాప్తంగా షేక్ చేయడానికి వస్తోంది..

దక్షిణాది అగ్రదర్శకుడు శంకర్ , సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ ఎమీ జాక్సన్ లు తీసిన రోబో 2.0 సినిమా సందడి ప్రారంభమైంది. బాహుబలి పబ్లిసిటీ చూశాక తమిళ అగ్ర దర్శకుడు శంకర్.. రోబో 2.0 ప్రమోషన్ ను వినూత్నంగా దేశంలో, తమిళనాడులో కాకుండా విదేశాల్లో మొదలుపెట్టాడు. ప్రపంచ సినిమాకు కేంద్రమైన అమెరికా లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ పార్క్ లో రోబో 2.0 తో ముద్రించిన భారీ 100 అడుగుల హాట్ ఎయిర్ బెలూన్ ను ఎగురవేశారు..

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని బీట్ చేయాలని శంకర్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇందుకు రజినీకాంత్, అక్షయ్ కుమార్ ల క్రేజ్ కూడా తోడవడంతో బాలీవుడ్, దక్షిణాదితో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసి బాహుబలిని మించి కలెక్షన్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి అందుకే హాలీవుడ్ నుంచే ప్రమోషన్ స్ట్రాట్ చేశారు. తరువాత వరుసగా 100 అడుగుల ఈ బెలూన్లను యూరప్, లండన్, దక్షిణాసియాల్లో ఎగురవేయనున్నట్టు రోబో 2.0 యూనిట్ తెలిపింది.

To Top

Send this to a friend