రేవంత్ టీఆర్ఎస్ ను ముంచటట్టే ఉన్నాడు…

కూలి పని పేరిట టీఆర్ ఎస్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు చట్టవిరుద్ధంగా బహిరంగంగా అవినీతికి పాల్పడ్డారా? కూలి చేసినట్లు నటించి నిమిషాల్లోనే కోట్ల రూపాయలు వసూలు చేశారా? ప్రజలు గంటల కొద్ది పనిచేసినా వందలు సంపాదించలేని కాలంలో టిఆర్ఎస్ నేతలు క్షణాల్లో కోట్లు ఎలా సంపాదించారు? టిఆర్ఎస్ నేతల కూలి పనుల గుట్టును విప్పాల్సిన తరుణం ఆసన్నమైందిని అంటున్నారు టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన కూలి పని పై రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటికీ ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది ఏఫ్రిల్ 27 న వరంగల్ జిల్లా కేంద్రంలో టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ సభను లక్షలాధి మందితో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సభ కోసం టీఆర్ ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు గులాబీ కూలీ పేరిట శ్రమదానం చేసి నిధులను సమీకరిస్తారని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఏఫ్రిల్ 15 వ తేది నుంచి గులాబీ పార్టీ నేతలు శ్రమదానం పేరిట నిధులను వసూలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హైదరాబాద్ నగరంలోని ఒక ప్రవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా కొన్ని నిముషాలపాటు వైద్య సేవలు అందించినందుకు రూ. 5 లక్షలు తన కూలిగా తీసుకున్నారు. కొన్ని నిమిషాలు పనిచేసినట్లు నటించి లక్షలు వసూలు చేయడం అవినీతి కాదా?

పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖ పరిధిలోకి వచ్చే రైస్ మిల్లులలో కూలి చేసినట్లుగా నటించి లక్షలు వసూలు చేశారని ఆయన తెలిపారు.

వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ యార్డులలో కూలి పేరుతో లక్షలు వసూలు చేశారు. మార్కెట్ యార్డులను పర్యవేక్షించాల్సిన మంత్రి మార్కెట్ లలో కూలీ చేసి లక్షలు సంపాదించడాన్ని ఏమంటారు?

రాష్ట్ర విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి వరంగల్ నగరంలోని ప్రవేటు విద్యాసంస్థలలో ఒక గంట పాఠం చెప్పినందుకు లక్షలు కూలిగా తీసుకున్నారు.

ఐటి మంత్రి కేటిఆర్ ఒక హోటల్ లో జ్యూస్ తయారుచేసే కార్మికుడిగా నటించి వారి నుంచి రూ. 7.5 లక్షలు కూలిగా తీసుకున్నారు.

మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్ రావు టీ లు, కూరగాయలు కొద్దిసేపు అమ్మినందుకు రూ. 8 లక్షలు కూలిగా రాబట్టుకున్నారు. ఒక ప్రవేటు ఆసుపత్రిలో చెత్త ఉడ్చడం ద్వార బంగారు షాపులో సెల్స్ బాయ్ గా కొద్దిసేపు పనిచేసి రూ. 5 లక్షలు కూలి సంపాదించారు.

గృహనిర్మాణ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని ఆసుపత్రి, కిరాణ దుకాణంలలో పనిచేయడం ద్వారా, కొద్దిసేపు పువ్వులు అమ్మడం ద్వారా రూ. 6.11 లక్షలు వసూలు చేశారు.

పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోయినపల్లి మార్కెట్ లో క్యారీబ్యాగ్ లు విక్రయించడం ద్వారా రూ. లక్ష సంపాదించారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు బౌద్దనగర్ లో చేపల అమ్మకం ద్వారా 5 లక్షల కూలి సంపాదించినట్లు చెప్పుకున్నారు.

రాష్ట్ర మంత్రుల వసూళ్ల కార్యక్రమంలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు రూ. 16.5 లక్షలు కూలిగా సంపాదించి మొదటి స్థానాన్ని ఆక్రమించగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ. 15 లక్షల కూలి సంపాదనతో రెండవ స్థానంలో నిలిచారు.

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలోని ఒక బట్టల దుకాణంలో కొద్దిసేపు చీరలు విక్రయించినందుకు కూలిగా రూ. 7 లక్షలు తీసుకున్నారు.

ఎంపీ కె.కేశవ రావు ఒక ప్రవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సిబ్బందికి ఉపన్యాసం ఇవ్వడం ద్వారా రూ. 2 లక్షలు కూలి సంపాదించుకోవడంతోపాటు తాను కొత్తగ కనిపెట్టిన వెరైటి ఐస్ క్రీం విక్రయించడం ద్వారా మరో 2 లక్షలు కూలిగా తీసుకున్నారని తెలిపారు.

క్షణాల పాటు కూలీ చేస్తే ఎవరు ఉచితంగా లక్షల రూపాయలు ఇవ్వరని, తమకు ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే లక్షల రూపాయలు సమర్పించుకోవడానికి సిద్దపడతారని స్పష్టం చేశారు రేవంత్. కూలి పనుల పేరిట భారీ మొత్తాలను నగదు, చెక్కుల రూపంలో వసూలు చేశారని చెప్పారు. రాష్ట్ర మంత్రులు తమ శాఖల పరిధిలో ఉన్నవారి నుంచి కూలీల రూపంలో లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేయడం అవినీతి మాత్రమే కాకుండా చట్టప్రకారం శిక్షార్హమైన నేరమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అవినీతి నిరోధక చట్టంలో ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వేంట్స్) ప్రజా సేవకుడిగా గుర్తించబడినటువంటి వ్యక్తి ఇతరరుల నుంచి విలువైన వాటిని స్వీకరించడం నేరమని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఆ విధంగా విలువైన కానుకలు, ఇతర వస్తువులను తీసుకున్న ప్రజా సేవకులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాను కూడ విధించాలని ఆ చట్టం చెబుతోందని చెప్పారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ఇతర సౌకర్యాలు పొందేవారందరూ ప్రజా సేవకుల చట్టం పరిధిలోకే వస్తారని అభిప్రాయపడ్డారు.

గులాబీ కూలికి సంబందించిన వివిధ పత్రికలలోని వార్తల క్లిప్పింగ్ లతోపాటు టీ న్యూస్ లో ప్రసారం చేసిన గులాబీ కూలి వసూళ్లకు సంబంధించిన వీడియో పుటేజీలను, మంత్రులు కూలి రూపంలో వసూలు చేసిన మొత్తాల వివరాలు రేవంత్ తన ఫిర్యాదుతోపాటు సమర్పించారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు, సిబిఐ అధికారులకు స్వయంగా ఫిర్యాదులను సమర్పించి వచ్చిన రేవంత్ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వార ఫిర్యాదులను పంపారు.

To Top

Send this to a friend