చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ఈ రోజు ఉదయం హైదరాబాదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు చిరంజీవి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మెగాస్టార్ డా,, కె. చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తరువాత సుమారు 225 మంది అభిమానులు, జనసైనికులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన రక్తదాతలలో అందరినీ మెగాస్టార్ కరచాళం చేశారు.
అత్యధికంగా 129 సార్లు రక్తదానం చేసిన శ్రీ సంపత్ కుమార్ ని, 35 సార్లు రక్తదానం చేసిన శ్రీ రాఘవ చార్యులని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా, ఆంధ్రా నుంచి వచ్చిన అనేక మంది జనసైనికులు హాజరయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్ర, ఓరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది మంది పాల్గొని జయప్రదం చేశారు అని రక్తనేత్రదాన కేంద్రం నిర్వాహకులు శ్రీ రవణం స్వామినాయుడు తెలిపారు.

To Top

Send this to a friend