జియో మరో బంపర్ ఆఫర్


జియో రంగ ప్రవేశంతోనే 4జీ ఫోన్ల కొరత తీర్చేందుకు రిలయన్స్ సంస్థ సొంతంగా ఎల్.వై.ఎఫ్ పేరుతో లైఫ్ మొబైల్ ఫోన్లను విడుదల చేసింది. ఈ లైఫ్ ఫోన్లతో పాటు జియో సిమ్ ను ఉచితంగా అందించి డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ లను ఫ్రీగా అందజేసింది.

అయితే ఆ తర్వాత సామ్ సంగ్ సహా దేశీయ, చైనా మొబైళ్లన్నీ 4జీ స్మార్ట్ ఫోన్లను 5 వేలకే అందుబాటులో తేవడంతో రిలయన్స్ సంస్థ తీసుకొచ్చిన లైఫ్ ఫోన్లకు ఆదరణ కరువైంది. ఇప్పుడు అందరూ జియో సిమ్ లు తీసుకుంటున్నారు తప్పితే లైఫ్ ఫోన్లను ఎవ్వరూ తీసుకోవడం లేదు. అందుకే జియో సరికొత్తగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఎల్.వై.ఎఫ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులందరికీ 20శాతం అధికంగా డేటా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. 6600 రూపాయల నుంచి 9700 రూపాయల విలువైన లైఫ్ ఫోన్లు వాడుతున్న వారందరికీ ఈ ఎక్స్ ట్రా డేటా, టాక్ టైం ఇస్తున్నట్టు పేర్కొంది. లైఫ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరగాలనే ఉద్దేశంలోనే రోజుకు 1 జీబీ డేటా స్థానంలో .. 1.2 జీబీ డేటా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జియో మేనియాలో చాలా మంది లైఫ్ ఫోన్లు కొనడంతో వారందరికీ ఇప్పుడు 1.2 జీబీ డేటా రోజుకు అందనుంది.

To Top

Send this to a friend