18కోట్లు వద్దనడానికి కారణం..


ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 కోట్ల యాడ్స్ వదులుకొని ప్రభాస్ సంచలనం రేపారు. కొన్ని షూ కంపెనీలు, ఫిట్ నెస్, ఎఫ్ఎమ్ జీసీ ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ చేయమని ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభాస్ ను సంప్రదించారట.. ఇందుకోసం ఏకంగా 18 కోట్లు ఇస్తామని దేశీయ దిగ్గజ కంపెనీలు ప్రభాస్ కు ఆఫర్ ఇచ్చాయట.. కానీ వీటన్నింటికి సున్నితంగా నో చెప్పాడట ప్రభాస్..

బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా ప్రభాస్ కు పేరొచ్చింది. ఈ క్రేజ్ ను వేరే హీరో ఎవరైనా సరే ఉపయోగించుకుంటారు. బాహుబలి సినిమా తో ఇప్పటికే ప్రభాస్ కు కోట్ల రూపాయల పారితోషికం వచ్చింది. దాంతోపాటు క్రేజ్ కూడా వచ్చింది. ఆ క్రేజ్ కు అనుగుణంగానే దేశ, విదేశీ కంపెనీలన్ని ప్రభాస్ తో ప్రకటనలు చేయించుకునేందుకు రెడీ అవుతున్నాయి. కానీ డబ్బు కంటే తనకు సినిమాలే ముఖ్యమని ప్రభాస్ చాటిచెప్పాడు. కోట్ల విలువైన యాడ్స్ ను వద్దనుకొని సంచలనం రేపాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపైనే దృష్టిపెట్టాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే ఏ డీల్ అయినా కుదుర్చుకునే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు.. బాహుబలి2 సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ హోదా తెచ్చుకున్న ప్రభాస్ ను పలువురు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు సినిమా చేసేందుకు సంప్రదించారట.. కానీ వీటన్నింటిని పక్కనపెట్టి సాహో సినిమా పూర్తయిన తర్వాతే చేస్తానని చెప్పాడట.. సో ఇలా క్రేజ్ ఉన్నప్పుడు సంపాదించుకోవాలని ఉవ్విళ్లూరే ప్రస్తుత నటులకు ప్రభాస్ వ్యతిరేకమని చెప్పవచ్చు.

To Top

Send this to a friend