పేలిన రెడ్‌మీ నోట్ 4

చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ ఇటీవల విడుదల చేసిన రెడ్‌మీ నోట్4 స్మార్ట్‌ఫోన్ బెంగళూరులోని ఓ షోరూంలో పేలిపోవడం కలకలం రేపుతోంది.

నగరానికి చెందిన అర్జున్ అనే వినియోగదారుడు స్థానికంగా ఉన్న ఓ మొబైల్ స్టోర్ నుంచి రెడ్‌మీ నోట్4 మొబైల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లిన అతడికి అందులో సిమ్‌కార్డ్ పెట్టడం ఇబ్బందిగా అనిపించడంతో తిరిగి అదే షోరూంకు తీసుకొచ్చి సిమ్ పెట్టాల్సిందిగా కోరాడు. దీంతో షోరూంలోని టెక్నీషియన్ ఆ ఫోన్ ప్యానల్ తీసి సిమ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు వచ్చి ఫోన్ పేలిపోయింది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ పేలిన ఘటనపై అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ పేలిన ఘటనపై షియోమీ స్పందిస్తూ వినియోగదారుడి భద్రతే తమ ప్రథమ లక్ష్యమని, బాధిత వినియోగదారుడిని కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది

To Top

Send this to a friend