నంద్యాలలో వైసీపీ ఓటమి ఖాయం.. కారణాలేంటి.?

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైపోయింది. నంద్యాల ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచి రౌండ్ రౌండ్ కు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందారెడ్డి.. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పై 1500 నుంచి 3000 వరకు ఓట్ల ఆధిక్యం కనబరుస్తూ దూసుకుపోతున్నారు. టీడీపీ విజయం ఖాయం కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటుడగా.. వైసీపీలో నైరాశ్యం అలుముకొని ఓటమిపై విశ్లేషణ బాట పట్టారు.

హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయం లో వైసీపీ అధినేత జగన్ నేతలతో సమావేశమయ్యారు. నంద్యాల ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించారు. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ సలహాలు కూడా నంద్యాలలో పనిచేయకపోవడం.. జగన్ ప్రచారం బెడిసికొట్టడంపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం..

ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై చేసిన పరుష వ్యాఖ్యలే కొంపముంచాయని చర్చించినట్టు తెలిసింది. ఇక అధికారంలో టీడీపీ ఉండడంతో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని.. ఏ ఉప ఎన్నికల్లోనైనా జనం అధికార పార్టీకే పట్టం కడతారని జగన్ నాయకులకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.

To Top

Send this to a friend