బిగ్ బాస్ కు ముమైత్ టాటా.. కారణమిదే..

ముమైత్ ఖాన్ నిన్న సడన్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నట్టు మిగతా సెలబ్రెటీలకు తెలిపింది. ఆ విషయం తెలియగానే అందులో ఉన్న సెలబ్రెటీలు చాలా మంది ఏడ్చేశారు. ముఖ్యంగా కత్తి కార్తీక, ధన్ రాజ్ లు ముమైత్ మీద పడి ఓ 5 నిమిషాల పాటు నీవు వెళ్లొద్దు అని ఏడ్చేశారు. కెప్టెన్ కల్పన, మధుప్రియ సహా చాలా మంది ఎందుకు వెళ్లిపోతున్నావని అడిగినా ముమైత్ ఏం సమాధానం చెప్పలేదు. బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయింది.

బిగ్ బాస్ షోలో నిన్న జరిగిన ఆశ్చర్య కర సంఘటన ఇదే.. గురువారం ఏ ఏలిమినేషన్ లేకున్నా కానీ సడన్ గా బిగ్ బాస్ ముమైత్ ఖాన్ ను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. కొన్ని చట్టపరమైన కారణాల వల్ల ముమైత్ ఖాన్ ను ఇంటినుంచి పంపించి వేస్తున్నట్టు బిగ్ బాస్ చెప్పాడు. ఆ కారణాలేంటి.? ముమైత్ ఎందుకు వెళ్లింది.? మళ్లీ తిరిగి బిగ్ బాస్ ఇంటిలోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొంది. తెలంగాణ పోలీసులు ముమైత్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. ఆమె హైదరాబాద్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అందుకే ముమైత్ ను బిగ్ బాస్ షో నుంచి సడన్ గా బయటకు పంపారు. అనుకున్నట్టే హైదరాబాద్ లో విచారణకు ముమైత్ హాజరైంది. ఆమె వెంట బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు. విచారణ పూర్తి కాగానే ముమైత్ మళ్లీ పుణె వెళ్లిపోయింది. ఈరోజు ఆమె షోలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

To Top

Send this to a friend