ఎన్.డీ.టీవీపై దాడి వెనుక?

ఎన్డీటీవీ.. హిందీలో ప్రముఖ జాతీయ చానల్.. దీని ఫౌండర్ ప్రణయ్ రాయ్ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకులో లోన్ తీసుకొని 48 కోట్లు ఎగొట్టాడని ప్రధాన ఆరోపణ. సీబీఐ రంగంలోకి దిగి సోదాలు చేసింది. ఆ చానల్ ఎండీ ప్రణయ్ రాయ్ ను అరెస్ట్ చేసే పనిలో కూడా ఉంది. దీనంతటికి కారణం ఎన్.డీ టీవీ మాజీ కన్సల్టెంట్ నిర్వాకమే కారణం.. ఆయనను ఎవరు ప్రోత్సహించిందన్నది బహిరంగ రహస్యమే..
ప్రధాని మోడీ కాంగ్రెస్ ను ఇప్పటికే దెబ్బతీశాడు. కానీ దానికి సపోర్టుగా జాతీయస్థాయిలో  బలమైన మీడియా ఉంది. ఇప్పుడు దాన్ని నియంత్రించే పనిలో పడ్డాడు. ఎన్.డీ టీవీ కాంగ్రెస్ కు సపోర్టుగా ఉంది. అందుకే దీని మూలాలు దెబ్బతీయడానికి ఓ మాజీ కన్సల్టెంట్ ను పురిగొల్పి ఆయన ఫిర్యాదు మేరకు సీబీఐతో దాడులు చేయిస్తోందనేది కాంగ్రెస్ ఆరోపణ..
నిజానికి ఎన్డీటీవీ ఎండీ ప్రణయ్ రాయ్  ఏడేళ్ల క్రితమే అప్పు తీసుకున్న ఐసీఐసీఐ బ్యాంకుకు ఆ లోన్ మొత్తం చెల్లించేశాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఈరోజు మీడియా సమక్షంలో విడుదల చేశాడు. బీజేపీ తమను టార్గెట్ చేసిందని ప్రణయ్ ఆరోపించాడు.
ఎన్డీటీవీపై దాడి బీజేపీ ప్రభుత్వం, మోడీ కక్షసాధింపేనని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నందుకే ఎన్డీటీవీపై సీబీఐతో దాడులు చేయిస్తోందని విమర్శించింది.. దీనికి కౌంటర్ ఇచ్చిన వెంకయ్య చట్టం తన పని తాను చేసుకుపోతుందని సమాధానమిచ్చారు. పార్టీలు పార్టీలు కొట్టుకోవడం సహజమే కానీ.. పార్టీలకు సపోర్టు చేసే మీడియాను కూడా మోడీ వదలకపోవడం ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది.
To Top

Send this to a friend