రవితేజ మళ్లీ మళ్లీ అబద్దాలు

మాస్‌ మహారాజ రవితేజ ఇన్నాళ్లు నిర్మించుకున్న స్టార్‌డం ఒక్క సంఘటనతో కూలిపోయింది. తమ్ముడు భరత్‌ అంత్యక్రియలకు హాజరు కాక పోవడంతో రవితేజపై జీవితంలో చెరిపేసుకోలేని పెద్ద మచ్చ పడటం జరిగింది. తమ్ముడిపై ఎంత కోపం ఉన్నా కూడా రవితేజ అంత్యక్రియలకు హాజరు కావాల్సింది. తల్లిదండ్రులను కూడా రవితేజ అంత్యక్రియలకు హాజరు కాకుండా చేశాడు అనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలోనే రవితేజ తాను చేసిన పనిని సమర్థించుకునేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

భరత్‌ చనిపోయిన సమయంలోనే తమ్ముడు డెడ్‌ బాడీని చూసి తట్టుకోలేకనే అంత్యక్రియలకు హాజరు కావడం లేదు అంటూ ప్రకటన చేశాడు. ఆ ప్రకటనపై విమర్శలు వచ్చాయి. మరీ ఇది విడ్డూరం అని, చనిపోయిన తమ్ముడిని చూడలేక ఆయన అంత్యక్రియల్లో పాల్గొనక పోవడం ఎక్కడ చూడలేదని సోషల్‌ మీడియాలో రవితేజపై విమర్శలు వచ్చాయి. వెబ్‌ మీడియా, సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు రవితేజ మరోసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.

తాజాగా ప్రముఖ దిన పత్రికకు రవితేజ సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో రవితేజ తన తమ్ముడిపై తనకు ఉన్న అభిమానంను, ప్రేమను ఒలకబోశాడు. అయితే అందులో నిజం లేదని, ఆయన చెప్పేవని అబద్దాలే అని మళ్లీ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రవితేజ ఎంత వివరణ ఇచ్చినా, ఎన్ని విధాలుగా తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినా కూడా ఆయనపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. రవితేజ తన తమ్ముడు భరత్‌ విషయంలో పదే పదే అబద్దాలు చెబుతున్నాడనే టాక్‌ వస్తూనే ఉంది.

To Top

Send this to a friend