నా కొడుకులు శ్రీరామ చంద్రుడు..

డ్రగ్స్‌ వ్యవహారంలో రవితేజ పేరు రావడంతో టాలీవుడ్‌లో సంచనం అయ్యింది. స్టార్‌ హీరో అయిన రవితేజ డ్రగ్స్‌కు అలవాటు పడటం ఏంటని అంతా కూడా అవాక్కవుతున్నారు. రవితేజ సోదరులు గతంలో డ్రగ్స్‌ వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెల్సిందే. వారి నుండే రవితేజకు కూడా డ్రగ్స్‌ అలవాటు అయ్యి ఉంటుంది అనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలోనే రవితేజ తల్లి రాజ్యలక్ష్మి మీడియా ముందుకు వచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. తన ముగ్గురు కొడుకులు కూడా ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా పెరిగారు. వారు ఏ సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఇబ్బందులు ఎదుర్కొని డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు అనేందుకు ఛాన్స్‌ లేనే లేదు అంటూ చెప్పుకొచ్చింది. తన కొడుకు రవితేజ కనీసం సిగరెట్‌ను కూడా తాగడు అంటూ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటిస్తే నటించవచ్చు కాని నిజ జీవితంలో మాత్రం నా కొడుకులకు ఎలాంటి దురలవాట్లు లేవు అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా తన కొడుకు భరత్‌ మరణం సమయంలో జరిగిన పరిణామాలపై కూడా ఆమె స్పందించారు.

మా కుటుంబం ఆనవాయితి ప్రకారం అంత్యక్రియలు జరిగే ప్రదేశంకు ఆడవాళ్ళం వెళ్లలేదు. అంత మాత్రాన భరత్‌ అంటే తమకు అభిమానం లేనట్లు కాదు అని ఆమె పేర్కొన్నారు. అయితే రవితేజ తల్లి రాజ్యలక్ష్మిగారు మాట్లాడుతున్న మాటలు అన్ని కూడా పచ్చి అబద్దాలు అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నో పార్టీల్లో రవితేజ తాగడం కనిపించింది. ఇక భరత్‌, రఘులు పలు కేసుల్లో అరెస్ట్‌ అయితే వారు ఎలా శ్రీరామ చంద్రులు అవుతారు అంటూ నెటిజన్స్‌ ఆమె ఇంటర్వ్యూపై మండిపడుతున్నారు.

To Top

Send this to a friend