బిగ్ బాస్ రేటింగ్ ఎంతో తెలుసా.?

సెలబ్రెటీల ఏడుపులు పెడబొబ్బలు, కోపతాపాలతో అతిమామూలుగా నడుస్తున్న బిగ్ బాస్ షో వెంటీ లేటర్ పైకి చేరుతుందా అన్న అనుమానాలు కలిగాయి. ఈ సమయంలోనే ప్రేక్షకులు ఈ షోకు బ్రహ్మరథం పట్టడం.. వీకెండ్ లలో ఎన్టీఆర్ మరింత క్రేజ్ ను పెంచడంతో ఈ షోకు ఆదరణ పెరుగుతోందట.. ఇక సోమ వారం నుంచి శుక్రవారం వరకు ఎన్టీఆర్ కనపడని బిగ్ బాస్ షోకు 10.4 రేటింగ్ వస్తే…. వారాంతాల్లో ఎన్టీఆర్ కనిపించే శని, ఆదివారాల్లో ఏకంగా 16.5 రేటింగ్ సాధిస్తోందట.. రియాలీటీ షోల్లోనే ఇది పెద్ద రేటింగ్ అట.. భారీ రేటింగ్ సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ షోపైనే పడింది. ఏదేతేనేం.. తారక్ బిగ్ బాస్ షో ఇరగదీసిందనే చెప్పవచ్చు..

ఇప్పటివరకు తెలుగు టీవీ చానల్స్ లో 4వ స్థానంలో ఉన్న మా టీవీ ఈ బిగ్ బాస్ షోతో ఏకంగా నంబర్ 1 స్థానంలోకి ఎగబాకడం రికార్డుగా చెప్పుకుంటున్నారు. తెలుగు టీవీ చరిత్రలోనే తొలి బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సంచలనం రేపుతోంది.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో తెలుగు నాట దుమ్మురేపుతోంది. మాటీవీలో నిర్వహిస్తున్న ఈ షో రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సోమ వారం నుంచి శుక్రవారం వరకు ఓ రేటింగ్.. వారాంతంలో ఎన్టీఆర్ ఏదో మాయ చేస్తుండడంతో రేటింగ్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోతోందట.. ఈ రేటింగ్ చూసి షో గ్రాండ్ హిట్ అని మాటీవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోందట.. తమిళనాట కమల్ హాసన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు అంతగా ఆదరణ లేకపోయినా ఇక్కడ తెలుగులో ఎన్టీఆర్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో దుమ్మురేపే టీఆర్పీలు తెచ్చుకోవడం పై నిర్వాహకులనే ఆశ్చర్య పరుస్తోందట..

స్టార్ మాటీవీ ప్రకటించిన ప్రకారం బిగ్ బాస్ కార్యక్రమం 16.5 రేటింగ్ సాధించి తెలుగు టీవీల్లోనే నంబర్ 1 రేటింగ్ ను సాధించి దూసుకుపోతోందట.. ఇటీవల కాలంలో జబర్ధస్త్ షో సహా ఏ టీవీ కార్యక్రమానికి ఇంత రేటింగ్ రాలేదట.. దీంతో తమ బిగ్ బాస్ షో హిట్ అని ప్రకటించారు మాటీవీ నిర్వాహకులు..

To Top

Send this to a friend