14 ఏళ్లకే రష్మీ ఆ పనిచేసిందట..

జబర్ధస్త్ తో పాటు పలు షోలో సందడి చేస్తున్న రష్మీపై ఎఫైర్ ల గోల ఎప్పటి నుంచో వినిపిస్తోంది. జబర్ధస్త్ టీం లీడర్, కమెడియన్ సుధీర్ తో ఆమెకు ఎఫైర్ ఉందని కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక తన తొలి చిత్ర హీరోతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య రానా వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న నెంబర్ 1 యారీ ప్రోగ్రాంలో రష్మీ చెప్పిన నిజం ఆమె అభిమానులకు కిక్కు ఎక్కించింది.

జబర్ధస్త్ నుంచి అనసూయ.. ప్రెగ్నేన్సీ కారణంగా వైదొలగడం యాంకర్ రష్మీకి వరమైంది. అనకోకుండా అవకాశం దక్కించుకున్న యాంకర్ రష్మీ.. ఆ షో కారణంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. జబర్ధస్త్ లో పాపులర్ అయ్యి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. రోమాంటిక్ పాత్రల్లో నటించి తాను చాలా హాట్ గురూ అంటూ నిరూపించుకుంది.

ఇక రానా నిర్వహిస్తున్న ఈ షోలో రష్మీ తన జీవితంలో జరిగిన తొలి అనుభవాన్ని తడుముకోకుండా చెప్పేసింది. 14 ఏళ్లకే యాంకర్ రష్మీకి ఓ స్వీట్ అనుభవం కలిగిందట.. రష్మీనే రానాకు ఈ విషయం చెప్పింది. తన మొదటి ముద్దు ఫస్ట్ కిస్ ను ఎవరికీ పెట్టిందనే విషయాన్ని రష్మీ చెప్పేసింది. తాను చదువుకుంటున్న సమయంలో తన ఫస్ట్ కిస్ ను పెట్టేశానని.. కానీ ఎవరికీ పెట్టానో మాత్రం చెప్పనంది. ముద్దేనా.. ఇంకా ముందుకెళ్లిందో లేదో మాత్రం వెల్లడించలేదు..

To Top

Send this to a friend