అత్యాచార బాధితురాలి పేరు చెప్పి చిక్కుల్లో చంద్రబాబు


మైనర్ అయ్యిండి అత్యాచారాలకు గురైన బాలికల పేర్లను, వివరాలు, సంబంధీకుల సమాచారాన్ని ఎక్కడ చెప్పకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చట్టం చేసింది. ఈ నిబంధనను ఏపీ సీఎం చంద్రబాబు మరిచిపోయి బాలిక పేరు, తల్లిదండ్రుల పేర్లను చెప్పి ఘోర తప్పిదం చేశారు.

ఇటీవల ఏపీకి చెందిన ఓ మాజీ జవాన్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి జమ్మూ కాశ్మీర్ తీసుకొళ్లి 50 రోజులకు పైగా ఆమెపై అత్యాచారం చేశాడు. పోలీసులు చాలెంజ్ గా తీసుకొని ఈ కేసును ఛేదించారు. బాలికను విడిపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఏపీ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది.

ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికకు, ఆ కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థికసాయం ప్రకటించారు. ఆ తర్వాత బాలిక పేరును, ఆమె తల్లిదండ్రులకు ఆర్థికసాయం చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్ , ఫేస్ బుక్ ఖాతాలో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం తీర్పుల ప్రకారం రేప్ కు గురైన బాధితులు,వారి సమాచారం వెల్లడించరాదు. కానీ చంద్రబాబు బాలిక ఫొటోను ట్విట్టర్ పెట్టడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

To Top

Send this to a friend