రానాను మరో మెట్టు ఎక్కించే చిత్రం


హీరోగా రానా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని ‘బాహుబలి’ మినహా మరే సినిమాలు కూడా కమర్షియల్‌గా రానాకు సక్సెస్‌ను అందించలేక పోయాయి. ‘బాహుబలి’ చిత్రంలో రానా విలన్‌గా నటించాడు. కనుక ఆ సక్సెస్‌ రానాకు దక్కదు. అంటే రానా ఇప్పటి వరకు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. అయితే తాజాగా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో రానా మొదటిసారి కమర్షియల్‌ సక్సెస్‌ అందుకుంటాడనిపిస్తుంది.

ఇటీవలే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా సక్సెస్‌ గ్యారెంటీ అనే టాక్‌ వినిపిస్తుంది. అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. రానా చెప్పిన డైలాగ్స్‌ మరియు రానా లుక్స్‌ కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదట్లో ఏమాత్రం అంచనాలు లేవు. కాని టీజర్‌ మరియు ట్రైలర్‌తో సినిమా భారీగా ఉండబోతుందని అనిపిస్తుంది.

సీఎం సీటు చుట్టు తిరిగే కథగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. రానా మొదటి సినిమా కూడా పొలిటికల్‌ కథ. అయితే ఆ సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పెద్దగా లేవు. కాని ఈ సినిమాలో పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది. వంద మంది ఎమ్మెల్యేలను హోటల్‌లో దాస్తే సీఎం అవ్వొచ్చు, సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి అంటూ రానా చెబుతున్న డైలాగ్స్‌ విజిల్స్‌ కొట్టించేవిగా ఉన్నాయి. తప్పకుండా రానా ఈ సినిమాతో సక్సెస్‌ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

To Top

Send this to a friend