టీవీ9 యాంకర్ ను కొట్టబోయిన రానా

మొన్నటికి మొన్న డ్రగ్స్ కేసులో పాపం రవితేజ, పూరి సహా చాలా మందిని టార్గెట్ చేసి మీడియా చిలువలు పలువలు చేసి వారి ఇజ్జత్ మొత్తం తీసేసింది. నిజానికి కేసులో వారు ముద్దయిలుగా అయ్యి శిక్ష పడితేనే వారిపై వార్త రాయాలి. కానీ మీడియా విచారణకు వచ్చినప్పుడే వారిని దొంగలు చూస్తూ కథనాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రాసేసారు. ఆ అవమానాలకు వారి కుటుంబ సభ్యులు సైతం బయటకొచ్చి మీడియాపై ఆగ్రహం వ్యక్తి చేసిన సంగతి తెలిసిందే..

తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలను అవమానిస్తూ కథనం ప్రసారం చేసిన టీవీ9తో పాటు వ్యతిరేకంగా ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేధించి కేసీఆర్ మీడియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అప్పటినుంచి కేసీఆర్ తో తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా పెట్టుకోవడం లేదు.

మీడియా చేసే అతి వల్ల సెలబ్రెటీలు ఎంత బాధపడతారో అంతే కోపాన్ని ప్రదర్శిస్తారు. హీరో రానా కూడా అదే చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా రానా టీవీ9 స్టూడియో వెళ్లాడు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు వివరిస్తుండగా.. యాంకర్ ‘మీకు డ్రగ్స్ తో లింకులున్నాయట కదా.. మీరు విదేశాల నుంచి మొన్నీ మధ్యనే పార్సిల్ తెచ్చుకున్నారట.. అది తనిఖీ చేయడానికి ఎక్సైజ్ పోలీసులు మీ ఇంటికి వచ్చారట నిజమేనా’ అని అడిగేసింది. దీంతో ఒక్కసారిగా లేచి యాంకర్ ను కొట్టబోయేలా రానా అరిచాడు. నే చెప్పేది ఏంటి.? నువ్ అడిగేందేంటి.? గట్టిగా అరిచాడు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రానా ఆ విషయాలను అడగకుండా డ్రగ్స్ తో రానాకు సంబంధమున్నట్టు అడిగే సరికి తీవ్రంగా కోపంతో ఊగిపోయాడు. ఇప్పుడిది మీడియాలో, బయటా హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend