పవన్ టార్గెట్ గా వర్మ విమర్శలు.

రాంగోపాల్ వర్మ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ పై పడి ఆయన పరువుకు భంగం కలిగిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై రివ్యూను రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఇందులో పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సినిమాను అనలైజ్ చేస్తూ మధ్యలో విజయ్ నటనా స్థాయిని తెలిపేందుకు పవన్ కళ్యాణ్ ను పోల్చుతూ వర్మ పలు హాట్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ లుక్స్, ఛరీష్మా పరంగా పవన్ కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉందని ప్రశంసించాడు.

విజయ్ నటన విషయానికొస్తే 20 రెట్లు పవన్ కళ్యాణ్ కన్నా మంచి పెర్ఫార్మర్ ఇచ్చాడని వర్మ కొనియాడాడు.. అలాగే విజయ్ కు ‘రేలా పవర్ స్టార్’ అనే బిరుదును ఇవ్వాలని కూడా ప్రశంసించాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న నటుడు విజయ్ దేవరకొండను పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పవన్ అభిమానులు వర్మ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

To Top

Send this to a friend