కేసీఆర్, అకున్ పై వర్మ వ్యాఖ్యల దుమారం..

 

డ్రగ్స్ వ్యవహారం సీఎం కేసీఆర్ పాలనకు పెద్ద మచ్చ అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్టులు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని , కేసీఆర్ ను, ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ తీరును వర్మ దుయ్యబట్టారు. ఈ డ్రగ్స్ కేసు తెలంగాణ ప్రతిష్టకే భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. వర్మ వరుస పోస్టులు దుమారం రేపాయి.

 

 

వర్మ ఈ సందర్భంగా బాహుబలి గొప్పతనాన్ని డ్రగ్స్ తో వచ్చిన మచ్చను సరిపోల్చారు.. వర్మ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘ బాహుబలి సినిమాతో హైదరాబాద్ ప్రతిష్ట, తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించింది. కేసీఆర్ పాలనపై దేశవ్యాప్తంగా కూడా మంచి పేరుంది. బాహుబలితో రెండు తెలుగు రాష్ట్రాలకు పేరు వచ్చింది. ఇప్పుడా పేరును డ్రగ్స్ కేసు పోగొట్టింది. డ్రగ్స్ కేసు వల్ల తెలంగాణ సర్కారు, కేసీఆర్ ఇన్నాళ్లు తెచ్చుకున్న పేరు పోయింది. ముంబై ప్రజలు కేసీఆర్, తెలంగాణను గొప్పగా ఊహించుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసు మొత్తం కేసీఆర్ పరువును తీసిందని’ వర్మ ఆరోపించారు.

 

 

డ్రగ్స్ కేసుల కారణంగా పంజాబ్ కన్నా దారుణ స్థితిలో తెలంగాణ ఉందని ముంబై వాసులు అంటున్నారని వర్మ తన పోస్టులో పేర్కొన్నాడు. డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందని.. పంజాబ్ కంటే తెలంగాణ అధ్వానంగా తయారైందని ముంబై ప్రజలు భావిస్తున్నారని.. ఇది చాలా విచారకరమని వర్మ చెప్పారు. కేసీఆర్ ఏదైనా సాధించగలడని ముంబై ప్రజలు ఒకప్పుడు కొనియాడారని.. ఇప్పుడు తెలంగాణ స్కూళ్లలో కూడా డ్రగ్స్ మూలాలు బయటపడడం .. సిట్ పేరుతో అకున్ సభర్వాల్ సినీ ప్రముఖులను టార్గెట్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ట మసక బారుతోందని వర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..

To Top

Send this to a friend