పవన్ కోసం రాంచరణ్ త్యాగం.

పవన్ పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు. త్రివిక్రమ్ తో చేసే సినిమానే చివరిదని ప్రకటించేశారు. సంక్రాంతి తర్వాత నుంచి ఇక పవన్ సినిమాల్లో నటించడనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.. మళ్లీ 2019 ఎన్నికల తర్వాత ప్రజాతీర్పును బట్టి రాజకీయాల్లో కొనసాగాలా..? లేక హీరోగా సెటిల్ అవ్వాలా అన్నది డిసైడ్ చేయనున్నాడట.. ఇలా త్రివిక్రమ్ సినిమాతోనే ప్రస్తుతానికి విరామం ప్రకటించనున్న పవన్ కళ్యాణ్ కు పోటీగా తన సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండడంతో రాంచరణ్ పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.

2019 ఎన్నికలపై పవన్ గురిపెట్టారు. సంక్రాంతిలోపు ప్రస్తుతం చేస్తున్న తివ్రిక్రమ్ సినిమాను పూర్తి చేసి ఇక పూర్తిగా ఏపీలో ప్రజలతో మమేకమై జనసేనను నిలబెట్టాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక రాంచరణ్ కూడా సంక్రాంతి బరిలో నిలవడంతో బాబాయ్-అబ్బాయ్ పోటీ పడడం తప్పదని అందరూ భావించారు. రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రం యూనిట్ ఇదివరకే ప్రకటించింది.

కానీ పవన్ -త్రివిక్రమ్ సినిమా లేట్ కావడంతో దసరా నుంచి షిఫ్ట్ అయ్యి సంక్రాంతి కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే బాబాయ్ పవన్ సినిమాతో తాను పోటీపడలేనని.. బాబాయ్ రాజకీయ జీవితానికి త్రివిక్రమ్ సినిమా ఎంతో ప్రధానమని.. మెగా హీరోల వద్ద క్లాష్ వద్దని రాంచరణ్ డిసైడ్ అయినట్టు తెలిసింది. బాబాయ్ పవన్ సినిమా సంక్రాంతి బరిలో నిలిస్తే తాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేస్తానని ప్రకటించాడు. బాబాయ్ 2019 ఎన్నికలకు వెళుతుండడం.. ఇదే చివరి సినిమా అని ప్రకటించడంతో పవన్ కోసం తన సినిమాను ప్రతిష్టాత్మక సంక్రాంతి బరిలోంచి రాంచరణ్ తప్పించి త్యాగ పురుషుడిగా నిలిచిపోయాడు రాంచరణ్. బాబాయ్ పొలిటికల్ ఇమేజ్ కు తన వంతు సాయంగా రాంచరణ్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

To Top

Send this to a friend