అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చా..

బాహుబలి తర్వాత రాజమౌళి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మగధీర సినిమానే.. ఆ సినిమాలో కూడా సగభాగం చారిత్రక నేపథ్యమున్న కథనే వాడారు. 100 కోట్ల వసూళ్లు సాధించి దక్షిణాదిలో మంచి పేరు సంపాదించింది. మరి మగధీర సినిమా క్రెడిట్ ఎవరిది అని ఆ సినిమా నిర్మించిన అల్లు అరవింద్ ను అప్పట్లో ప్రమోషన్ లో భాగంగా అడిగితే.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ది అని చెప్పాడు. ఆ మాటలే దర్శకుడు రాజమౌళిని బాధించాయట.. అందుకే మగధీర సినిమా విషయంలో తనకు చాలా కోపాలున్నాయని.. అందుకే ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్ కు తాను రాలేనని చెప్పానని దర్శకుడు రాజమౌళి సంచలన విషయాలు వెల్లడించారు.

బాహుబలి లాంటి కళాఖండం తీసిన తర్వాత రాజమౌళి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో సంచలన విషయాలు వెల్లడించారు. అప్పట్లో మగధీర సినిమా 100 కోట్లు సాధించిందని.. ఎంతో బాగా పేరు ప్రతిష్టలు వస్తే ఆ క్రెడిట్ అంతా హీరో రాంచరణ్ మీదే వేశారని రాజమౌళి వాపోయారు. నిర్మాత అల్లు అరవింద్ సినిమా హిట్ ను మొత్తం రాంచరణ్ స్టామినా వల్లనే వచ్చిందని తన దర్శకత్వాన్ని అవమానించాడని.. అందుకే ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్ కు రానని చెప్పానని రాజమౌళి కుండబద్దలు కొట్టారు.

అల్లు అరవింద్ తన దర్శకత్వాన్ని అవమానించినందుకు నిరసనగానే తాను హీరో లేకుండా ఈగ సినిమా తీసి అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చానని రాజమౌళి తెలిపారు.    ఓ ఈగను హీరోగా పెట్టి సినిమా తీసి కసి తో హిట్ కొట్టానని చెప్పాడు. ఈగ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో చెప్పనక్కరలేదని.. తన దర్శకత్వాన్ని వేలెత్తి చూపెట్టినవారందరికీ ఈగతో సమాధానం చెప్పానని రాజమౌళి చెప్పుకొచ్చారు.

To Top

Send this to a friend