ఎన్టీఆర్-రాజమౌళి కలిసి సినిమా తీయాలి..

ఇప్పుడు రాజమౌళి అంటే ఒక బ్రాండ్.. ఇప్పుడు రాజమౌళి ఓ కలెక్షన్ల సునామీ..ఈ దిగ్గజ దర్శకుడితో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలతోపాటు బాలీవుడ్ హీరోలు క్యూలో ఉన్నారు . కానీ మన జక్కన్న మాత్రం ఏ విషయం తేల్చడం లేదు. కథ సిద్ధమయ్యాయే సినిమాను, హీరోను ప్రకటిస్తానని చెప్పుకొస్తున్నాడు.. రాజమౌళి తన తరువాతి సినిమా ఎవరితో తీస్తాడనే ఉత్కంఠ ఇండస్ట్రీలో నెలకొంది. ఇందులో ఎన్టీఆర్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే రాజమౌళి తన తరువాతి సినిమాను ఏ హీరోతో తీస్తే మంచిదో తెలుపాలని ఓ మీడియా చానల్ పోల్ నిర్వహించగా మెజార్టీ ప్రజలు రాజమౌళి తను తరువాతి సినిమా ఎన్టీఆర్ తోనే తీయాలని సూచించడం విశేషం.. మొత్తానికి వీరిద్దరి అభిమానానికి తోడు సినిమా కూడా తీస్తే మరింత ప్రేక్షకాదరణ పొందడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ అంటే దిగ్గజ దర్శకుడు రాజమౌళికి విపరీతమైన అభిమానం.. ఇద్దరూ తమ తొలిచిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ చిత్రాలతో మరోసారి ఇండస్ట్రీలో మెరిసారు. వీరి అనుబంధం గురించి తెలిసే ఈ మధ్య ఓ పోల్ నిర్వహించాడట.. అందులో అందరూ రాజమౌళి ఎన్టీఆర్ తోనే తన తరువాతి సినిమా తీయాలని మెజార్టీ ఓట్లు వేశారు. ఇక రెండో స్థానంలో మహేశ్ బాబు నిలిచాడట.. సో జక్కన్న ప్రేక్షకుల కోరిక మేరకు ఎన్టీఆర్ తో సినిమా తీస్తాడా లేదా అన్నది తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend