బాహుబలి 3 తీద్దామని రాజమౌళి.. వద్దని ప్రభాస్..

చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలోనే ఇప్పుడు హీరో రానా కూడా బుల్లితెర మీద సందడి చేసేందుకు వస్తున్నాడు తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానల్ జెమినీ టీవీలో రానా వ్యాఖ్యాతగా ‘నంబర్ 1 యారీ’ అనే ప్రోగ్రాం ఈ నెలాఖరు నుంచి ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి తొలి అతిథులుగా దర్శక దీరుడు రాజమౌళి, నిర్మాత శోభు వచ్చారు. వారితో సరదాగా పలు ప్రశ్నలు వేస్తూ రాజమౌళి చేత ప్రభాస్ కు ఫోన్ చేయించారు.

రాజమౌళి నుంచి పోన్ రాగానే ప్రభాస్.. ‘అన్నయ్య .. చెప్పు’ అని అప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత రాజమౌళి ‘డార్లింగ్.. బాహుబలి3 తీద్దాం ’ అంటాడు. దీనికి షాక్ అయిన ప్రభాస్.. ‘అయ్య.. నీ అయ్యా’ వామ్మో అంటూ అరుస్తాడు. . ఈ పరిణామాలకు కార్యక్రమంలో పాల్గొన్న రానా, నిర్మాత శోభ నవ్వుకున్నారు. ఈ ఇంటస్ట్రింగ్ ప్రోగ్రాం జూన్ 25న జెమినీటీవీలో ప్రసారం కాబోతోంది. దాని ప్రోమోలో ఇదంతా చోటు చేసుకుంది.

బాహుబలితో దేశంలోనే సినిమా ఇండస్ట్రీకి గొప్ప కళాఖండాన్ని ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ఇంటా బయట కూడా సరదాగా ఉంటారు. ఇప్పటికే బాహుబలి కోసం ఐదేళ్లు త్యాగం చేసిన ప్రభాస్ ఇక రాజమౌళి బాహుబలి3 తీస్తానని చెప్పడంతో అవాక్కయ్యారు. ‘అయ్య నీ అయ్యా.. బాహుబలి3 నా’ అంటూ బెదిరిపోయాడు. ఈ ప్రోగ్రాం పూర్తి షో 25న ప్రసారం కానుంది. ప్రోమోలో ఇదంతా చోటుచేసుకుంది..

To Top

Send this to a friend