రేపు తేల్చేయనున్న జక్కన్న!

‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి తర్వాత చేయబోతున్న సినిమా ఏంటా అని అంతా చాలా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. ఈసారి చేయబోతున్న సినిమాలో భారీ గ్రాఫిక్స్‌ ఉండవని ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రంగా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చెప్పుకొచ్చాడు. అయితే జక్కన్న తర్వాత సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మరో రెండు మూడు నెలల్లో జక్కన్న కొత్త ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఒక మంచి కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. తన తర్వాత సినిమా గురించి ఇప్పటి వరకు పొడి పొడిగానే మాట్లాడిన రాజమౌళి మొదటి సారి పూర్తి సమాచారంను రానా నిర్వహిస్తున్న ‘నెం.1 యారి విత్‌ రానా’ టాక్‌ షోలో ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రేపు రాజమౌళితో రానా నిర్వహించిన టాక్‌ షో జెమిని టీవీలో ప్రసారం కాబోతుంది.

ఆ షోలో రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్‌ ఏంటి, మళ్లీ ప్రభాస్‌తో సినిమా విషయంపై జక్కన్న ఎలా స్పందించాడు, మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేస్తాడా అనే విషయాలను చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. రానాకు మళ్లీ రాజమౌళి ఛాన్స్‌ ఇస్తానన్నాడా అనే విషయానికి కూడా రేపు క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం జక్కన్న ఫ్యాన్స్‌ రేపటి రానా షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

To Top

Send this to a friend