‘బాహుబలి’ ఇచ్చిన ధైర్యంతో మెగాతో ఢీ

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీని ఎదిరించి నిలబడటం అంత సులభం కాదు. మెగా ఫ్యామిలీపై ఎంత కోపం ఉన్నా కూడా బయటకు చెప్పేందుకు మాత్రం ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించరు. కాని తాజాగా రాజమౌళి నిరభ్యంతరంగా మెగా నిర్మాత అల్లు అరవింద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘మగధీర’ చిత్రం రికార్డులు ఫేక్‌ అంటూ తేల్చి చెప్పాడు. కలెక్షన్స్‌ ఎక్కువ చూపడంతో పాటు, వంద రోజుల థియేటర్ల సంఖ్యను ఎక్కువ చేయడం వంటి పనులను రాజమౌళి తప్పుపట్టాడు.

ఇలా మరే దర్శకుడు కాని, నటుడు కాని మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని మాట్లాడేందుకు సాహసం చేయరు. కాని రాజమౌళి మాత్రం ‘బాహుబలి’ సినిమాతో తన స్థాయి అమాంతం పెరగడంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసేందుకు ముందుకు వచ్చాడు. మెగా ఫ్యామిలీ ఇప్పుడు తనను ఏం చేయలేదనే ఉద్దేశ్యంతో ఇలా జక్కన్న వ్యాఖ్యలు చేసి ఉంటాడు అనే టాక్‌ వినిపిస్తుంది. ఇక జక్కన్న తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ సాధించిన రికార్డులు నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజమౌళి ఇప్పట్లో మెగా హీరోతో సినిమా చేయడం అసాధ్యం అని తెలుస్తోంది. ఇప్పట్లో కాదు అసలు మెగా ఫ్యామిలీతో మళ్లీ జక్కన్న సన్నిహిత్యంను పెంచుకుంటాడా, మెగా ఫ్యామిలీకి దగ్గర అవుతాడా అనేది అనుమానమే. జక్కన్న తర్వాత సినిమా ఏంటి అనేది వచ్చే నెలలో తేలే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend