పూరి-రాజమౌళి పరస్పర..

బాలక్రిష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోంది. ఆ సినిమా టీజర్ లాంటి స్టంపర్ ఇటీవల విడుదలైంది. నటసింహం బాలయ్య ఈ సినిమాలో విజృంభించి నటించాడు. ఈ సినిమా టీజర్ చూశాక రాజమౌళి కూడా స్పందించాడు. బాలయ్యపై, పూరిపై ప్రశంసలు కురిపించారు. ఇంత స్పీడుగా.. ఇంత క్లారిటీగా సినిమా తీయడం ఒక్క పూరి జగన్నాథ్ కే సాధ్యమని ప్రశంసలు కురిపించాడు..

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా కోసం అన్ని రోజులు షూటింగ్ చేయడం నా వల్ల కాదని రాజమౌళిని పూరి అప్పట్లో ఆకాశానికెత్తేశాడు.. ఇప్పుడు రాజమౌళి వంతు వచ్చింది. పైసా వసూల్ టీజర్ చూసి పూరిని రాజమౌళి అభినందించారు. అంతేకాదు రాజమౌళి నుంచి ఓ అరుదైన ప్రశంస హీరో బాలక్రిష్ణ సినిమాకు వచ్చింది.

బాలయ్య పైసా వసూల్ సినిమాలో హై ఓల్టేజ్ ఎనర్జీని.. ఫర్ ఫ్మామెన్స్ ను చూపించాడని రాజమౌళి వేయినోళ్ల పొగిడేశాడు. బాలయ్య ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇలా పూరి, రాజమౌళి ఒకరిపై ఒకరు తమ సినిమాలపై పొగిడేసుకోవడం విశేషం..

To Top

Send this to a friend