మసిపూసి.. లీకేజీ నెపం జగన్ పై తోసేసి!


వందల కోట్ల ప్రజాధనం.. అనుయాయులకే కాంట్రాక్టు .. ఆర్భాటంగా అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలు.. అంతా ఆరు నెలలోపే నిర్మాణాలు.. అంతా నాసిరకం.. ఒక్క వానకే ఊరుస్తున్న భవనాలు.. ప్రాంగణాల్లోకి నీరు.. అందుకే తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఏపీ సర్కారు, స్పీకర్ కోడెల ఇదో కుట్రకోణమంటూ కొత్త రకం వాదనను తెరపైకి తెచ్చారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణాలు చిన్న వానకే చిగురుటాకుల వణికాయి. నాణ్యతా లోపాలు కళ్లకు కట్టాయి. దీనిపై వెబ్ సైట్లు, మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వంపై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించిన స్పీకర్ కోడెల ఇది వాన వల్ల వచ్చిన వరద కాదని.. పైపులను ఎవరో కోసేస్తే నీరు లీకైందని ఆరోపించారు. ఇందులో దీనికి కౌంటర గా కుట్రకోణం ఏమీ లేదని… నెపాన్ని వైసీపీపై మోపే ప్రయత్నాలు చేశారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. .

‘పోనీ ఇప్పుడు అసెంబ్లీలోని జగన్ చాంబర్ లో నీళ్లు కుట్రకోణంలో ఎవరో పైపు కోస్తే వచ్చాయనకుందాం.. సరే వదిలేద్దాం.. మరి చిన్నవానకే కూలిపోయిన సచివాలయ భవనంపై స్పీకర్ కోడెల ఏం చెప్తారో వేచిచూడాల్సిందే.. దాన్ని కూడా వర్షం కూల్చలేదు.. ఎవరో కూల్చేస్తారేమో అన్న ఆశ్చర్యపోనక్కర్లేదని’ వైసీపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

ఇలా వాన తెచ్చిన నష్టాన్ని స్పీకర్ కోడెల, ఏపీ సర్కారు కుట్రకోణం పేరు చెప్పి వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నాయకులు కూడా దీనికి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

To Top

Send this to a friend