టీడీపీలో రాధాకృష్ణ పాత్ర అంత పెద్దదా..?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుంగ అనుచరుడిగా.. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మంచి స్నేహితుడిగా.. వివాదాలు చెలరేగినప్పుడు మధ్యవర్తిగా మారి పరిష్కరించే సన్నిహితుడిగా రాధాకృష్ణ పేరు మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు దీన్నే ఓ టీడీపీ నాయకుడు స్వయంగా పేర్కొనడంతో హాట్ టాపిక్ గా మారింది..

గుంటూరు జిల్లా టీడీపీ నాయకుడు మాకినేని పెదరత్తయ్య ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్ర గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు . ఆయన చెప్పిన దానిప్రకారం టీడీపీలోకి ఇతరపార్టీల నాయకులని తీసుకొనిరావటానికి మధ్యవర్తిత్వం వహించేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే . ఎవరైనా ఎమ్మెల్యేలని కొనాలంటే మొదట సదరు ఎమ్మెల్యే అవసరాలు గుర్తించటం దానిప్రకారం ఏమికావాలో ఎంతకావాలో సమకూర్చటం రాధాకృష్ణ పని . ఇప్పటిదాకా మారిన 20 ఎమ్మెల్యేలకు బ్రోకరేజి చేసింది మన దమ్మున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే .

ఇలా పెద్ద రత్తయ్య మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విశాఖలోని ఖరీదైన స్థలంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రజ్యోతి పత్రికకు ఎకరంన్నర భూమిని మార్కెట్ రేటుకంటే తక్కువకు కట్టబెట్టడంతో ఈ వివాదంపై రత్తయ్య స్పందించారు. రాధాకృష్ణ టీడీపీలో చేసే పనిని వివరించాడు. అంత చేస్తున్న మనిషికి టీడీపీ చేస్తుంది తక్కువేనని రత్తయ్య పేర్కొనడం గమనార్హం.

To Top

Send this to a friend