రెండేళ్లే బాబు.. మేల్కోకపోతే కష్టమే..

రాజకీయాలు వేగంగా మారిపోతాయి. ప్రజాభిప్రాయాలు అంతే.. 2019 ఎన్నికలకు సీరియస్ గా రియాక్ట్ అవుతున్న వైఎస్ జగన్ వేడి చూశాక చంద్రబాబుకు ఆయన సన్నిహితులు హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. ఇప్పటికే చంద్రబాబు వ్యాఖ్యలు, విశాఖ భూ కుంభకోణం, నాసిరకం అమరావతి నిర్మాణాలతో చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇకనైనా మేల్కోకపోతే 2019లో గెలవడం కష్టమని ఆయన సన్నిహితులు హెచ్చరించినట్లు సమాచారం.

చంద్రబాబుకు అనుంగ మిత్రుడు, శిష్యుడు కం సలహాదారు అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవలే తన పత్రిక ద్వారా చేయించిన సర్వే రిపోర్టులతో చంద్రబాబును కలిసి హితబోద చేసినట్టు తెలిసింది. మేలుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అని రాధాకృష్ణ హెచ్చరించినట్టు తెలిసింది.

ఏపీలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తరఫు ఉన్నవాళ్లందరూ భారీగా లాభపడ్డారు. నిధులు లేక కొట్టుమిట్టాడిన అందరికీ భారీగా లాభం జరిగిందనేది ఇన్ సైడ్ టాక్. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా టీడీపీ నేతలు భారీగా పెట్టుబడులు పెట్టి.. కొత్త బిల్డింగ్ లు కట్టించి జీతాలు పెంచిపిచ్చారు. దాంతో పాటు పోలవరం, వట్టిసీమ కాంట్రాక్టులతో టీడీపీ నేతలు భారీగా లాభం పొందారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ యథాప్రకారం కొనసాగాలంటే చంద్రబాబు మారాల్సిందేనని రాధాకృష్ణ సహా సీనియర్ టీడీపీ నేతలు, విశ్లేషకులు బాబుకు చెప్పినట్టు సమాచారం.

ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. ఈలోపే ప్రజాకర్షక పథకాలు అమలు చేసి ప్రజాదరణ పొందకపోతే బాబు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనన్న భావనను రాధాకృష్ణ అండ్ టీం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జగన్ ను ఎదుర్కోవడానికి పేదలపై మరిన్ని పథకాలు వాన కురవాలని సూచించినట్టు తెలిసింది. 2019 ఎన్నికలకు మరిన్ని ఆకర్షణీయ పథకాలకు పథకరచన చేయాలని లేకపోతే గెలవడం కష్టమని వీరంతా సూచించినట్టు తెలిసింది.

మొత్తంగా జగన్ ను కాచుకొని నిలవడానికి మరోసారి టీడీపీ శిబిరం సమాలోచనలు జరపడం తాజాగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంతో లాభపడ్డ వీరందరూ మరో ఐదేళ్లు ఇలాగే కొనసాగాలంటే టీడీపీ ప్రభుత్వం ఉండాల్సిందేనని.. ఇందుకోసం చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని వారు స్ఫష్టం చేసినట్టు తెలిసింది.

To Top

Send this to a friend