రారండోయ్‌ వల్ల భారీ నష్టం.. ఎవరికో తెలుసా?

నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ విడుదల తర్వాత నిరాశను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు రొటీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనే టాక్‌ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ సినిమా షూటింగ్‌ సమయం నుండి భారీ అంచనాలున్న నేపథ్యంలో అన్ని ఏరియా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను పెద్ద మొత్తాలకు కొనుగోలు చేయడం జరిగింది. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత నాగార్జున ఏకంగా 25 కోట్లకు అమ్మడం జరిగింది. తీరా ఇప్పుడు విడుదల తర్వాత సినిమా మొత్తంగా 10 కోట్లు కూడా వసూళ్లు చేసేలా లేదు.

మొదటి మూడు రోజుల్లో దాదాపు 7.5 కోట్లను వసూళ్లు చేసిన ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో కూడా పెద్దగా కలెక్షన్స్‌ను రాబట్టడం సాధ్యం కాదని తేలిపోయింది. మొత్తంగా 10 నుండి 12 కోట్లు వసూళ్లు చేస్తే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ సమయంలోనే చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తల పట్టుకున్నారు. దాదాపు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్లకు 10 నుండి 13 కోట్ల వరకు నష్టాలు తప్పవని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. అయితే నాగార్జునకు మాత్రం మంచి లాభాలు ఖాతాలో పడ్డాయి

To Top

Send this to a friend