కోర్టును ఆశ్రయించిన మగధీరుడు

టాలీవుడ్‌ రికార్డులను అప్పట్లో తిరగరాసిన ‘మగధీర’ చిత్రం తెలుగులో ఒక బెంచ్‌ మార్క్‌ చిత్రంగా నిలిచి పోతుంది. ‘మగధీర’ రికార్డులను క్రాస్‌ చేసేందుకు స్టార్‌ హీరోలకు సైతం సాధ్యం కాలేదు. చాలా సంవత్సరాల తర్వాత మగధీర రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘మగధీర’ చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాడు.

బాలీవుడ్‌లో తాజాగా తెరకెక్కిన సుశాంత్‌ సింగ్‌, కృతి సనన్‌ జంటగా నటించిన ‘రాబ్తా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఆ కథ అచ్చు ‘మగధీర’ కథను పోలి ఉంది. రెండు జన్మల ప్రేమ నేథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. కాకుంటే మగధీర కాస్త భారీగా ఉంటుంది. దాంతో ఆ సినిమాపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద చర్చలు తీసుకోవాల్సిందిగా నిర్మాత అల్లు అరవింద్‌ కోర్టును ఆశ్రయించాడు. రాబ్తా ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌ కూడా ‘మగధీర’కు ఇది కాపీ అని చెప్పకనే చెబుతున్నాయి.

కోర్టు ‘రాబ్తా’ చిత్ర యూనిట్‌ సభ్యులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. జూన్‌ 1 వరకు కాపీ రైట్‌ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. తాజాగా అల్లు అరవింద్‌ ఆ సినిమా విడుదల నిలిపేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. జూన్‌ 1న ‘రాబ్తా’ యూనిట్‌ సభ్యులు ఇచ్చే వివరణ సరిగా లేకుంటే జూన్‌ 9న విడుదల కావాల్సిన ఆ సినిమా విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు. మొత్తానికి విడుదల సమయంలో అల్లు అరవింద్‌ ‘రాబ్తా’పై నొక్కిన నొక్కుకు బాలీవుడ్‌ వర్గాల వారు కూడా షాక్‌ అవుతున్నారు.

To Top

Send this to a friend