బాలయ్యకు శాపంగా పూరి ట్రాక్ రికార్డ్

బాలక్రిష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోంది. ఆ సినిమా టీజర్ లాంటి స్టంపర్ ఇటీవల విడుదలైంది. నటసింహం బాలయ్య ఈ సినిమాలో విజృంభించి నటించాడు. ఈ సినిమా టీజర్ చూశాక రాజమౌళి కూడా స్పందించాడు. బాలయ్యపై, పూరిపై ప్రశంసలు కురిపించారు. ఇంత స్పీడుగా.. ఇంత క్లారిటీగా సినిమా తీయడం ఒక్క పూరి జగన్నాథ్ కే సాధ్యమని ప్రశంసలు కురిపించాడు..

ఇక అందరూ మెచ్చుకుంటున్న పైసా వసూల్ సినిమాకు బిజినెస్ మాత్రం కావడం లేదట.. సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ఇప్పటికే పూరి జగన్నాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ గా సాగుతున్నాయి. స్పైడర్, జై లవకుశ సినిమాలకంటే 4వారాల ముందే బాలయ్య సినిమా విడుదల చేసేందుకు పూరి జగన్నాత్ ప్లాన్ చేశారట..

ఓ వైపు బాలయ్య, మరో వైపు పూరి, టీజర్ కు విశేష స్పందన వస్తున్నాకూడా ఈ సినిమాను కొనేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపడం లేదని టాక్. శాతకర్ణి మార్కెట్ తో పోలిస్తే పైసా వసూల్ ను ఆ రేటుకు కొనలేమని బయ్యర్స్ అంటున్నారు. సీడెడ్, నైజాం, ఓవర్సీస్ బిజినెస్ , ఆంధ్రాలో జిల్లాల వారీ గా బయ్యర్స్ సినిమాకు తక్కువ కోట్ చేశారని తెలిసింది. 45 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని పూరి ఆశపడగా.. ఇప్పటివరకు కేవలం 20 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగిందని తెలిసింది… మరో 10 కోట్ల వరకు శాటిలైట్ రైట్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా బాలయ్య-పూరి సినిమాను పూరి ట్రాక్ రికార్డ్ దృష్ట్యా బయ్యర్లు కొనేందుకు ధైర్యం చేయడం లేదట..

To Top

Send this to a friend