పూరిపై ప్రశ్నల వర్షం.. సమాధానాలు..

 

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూరి జగన్నాథ్ .. ఉదయం 10.30కు విచారణకు కుటుంబంతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చారు. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన భార్య, కొడుకు ఆకాష్ , తమ్ముడు సాయిరాంశంకర్ ఉన్నారు. విచారణ సుధీర్ఘంగా సాగడంతో వారికి బోజనాలు కూడా తెప్పించారు. పూరి జగన్నాథ్ పోలీసులు వేసిన ప్రశ్నలకు ఎక్కడా తొనకలేదని.. తనకు డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్ కేవలం పబ్ లలో పరిచయం మాత్రమేనని.. కెల్విన్ తో తాను ఒకటి రెండుసార్లు పబ్ లో కలవడం తప్పితే బయటా ఎక్కడా తమకు సంబంధాలు ఫోన్ సంభాషణలు లేవని పూరి చెప్పినట్టు సమాచారం.

 

పోలీసులు డ్రగ్స్ దందాకు కీలక పాత్ర పోషించింది పూరియేనని ప్రశ్నించినట్టు సమాచారం. పూరియే మిగతా నటులకు డ్రగ్స్ సరఫరా చేస్తాడని.. ముమైత్, సుబ్బరాజ్, శ్యామ్ కే నాయుడు, రవితేజ పూరి గ్రూప్ సభ్యులేనని పోలీసులు పూరిపై ప్రశ్నల వర్షం కురిపించారట.. అంతేకాదు రోజు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారని ప్రశ్నించినట్టు తెలిసింది. పూరిని ఓ డీఎస్పీ, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు కలిసి విచారించారని.. ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ విచారించలేదని సమాచారం.

 

అయితే తొనకకుండా.. బెదరకుండా సమాధానం ఇచ్చిన పూరి పక్కా ప్లాన్ తోనే వచ్చినట్టు చూస్తే అర్థమైందని పోలీసులు వ్యాఖ్యానించారు.. పూరి ఎప్పుడూ తెల్ల చొక్కాలు వేసుకోడు.అన్నీ కలర్, ఫ్యాషన్ దుస్తులే ధరిస్తాడు. అలాంటిది విచారణకు తెల్ల చొక్కాలో రావడం విశేషం.

To Top

Send this to a friend