పవన్ బర్త్ డే స్పెషల్

 

పవన్ కళ్యాన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఇంజినీర్ బాబు, ’ రాజు వచ్చినాడో అనే పేర్లను దర్శకుడు త్రివిక్రమ్ పరిశీలించారు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ను ఫిలించాంబర్ లో రిజిస్ట్రర్ చేయించినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమాకు అదే పేరు ఖాయంగా కనిపిస్తోంది. పవన్ బర్త్ డే కానుకగా ఈరోజు విడుదలైన తొలిపాటకు సోషల్ మీడియాలో అదిరిపోయే రీతిలో స్పందన వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపట్లోనే 10 లక్షల మంది ఈ పాటను చూశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు త్రివిక్రమ్ సంగీత సంచలనం అనిరుధ్ తో పాటలు కొట్టించాడు. ఇక పవన్ బర్త్ డే సందర్భంగా శనివారం త్రివిక్రమ్ ఓ పాటను విడుదల చేశారు. ‘బయటకొచ్చి చూస్తే’ అనే సాంగ్ యువతను ఉర్రూత లూగిస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగంపై ఈ పాట ఉంది.

శనివారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు నిర్మిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు..

పవన్-త్రివిక్రమ్ కాంటోలోని సినిమాలో విడుదల చేసిన పాటను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend