రాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు?

సోనియాగాంధీ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు రెడీ చేశారు. ఎలాగైనా సరే ఈసారి బీజేపీకి రాష్ట్రపతి పీఠం దక్కకుండా చేయాలని సోనియాగాంధీ దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటితో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీల బలాబలాలను చూస్తే .. దేశంలోని మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లు 10,98,882. పార్లమెంటు సభ్యులతో పాటు దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీల, ఇతర ప్రజాప్రతినిధుల అందరి ఓట్ల ను కలిపితే ఇన్ని ఓట్లు వస్తాయి. ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలవడానికి మేజిక్ మార్కు 549442 ఓట్లు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఉన్న ఓట్లు 531442 (48.3శాతం). మేజిక్ ఫిగర్ కు బీజేపీకి ఇంకా 1.7శాతం ఓట్లు కావాలి.

ఈ తేడానే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రహస్య ఓటింగ్ తో ఎన్నుకుంటారు. విప్ జారీని కేంద్రం ఎన్నికల సంఘం నిషేధించడంతో ఎవరు ఏ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి. దీంతో మంచి అభ్యర్థిని నిలబెడితే బీజేపీని ఓడించవచ్చన్న ధీమా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

బీజేపీకి ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అడ్వాణీని నిలబెట్టడం.. లేదంటే జార్ఖండ్ గవర్నర్, గిరిజన జాతికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ప్రకటించడం.. లేదంటే సుష్మస్వరాజ్, మురళీ మనోహర్ జోషి, మోహన్ భగవత్ లు రాష్ట్రపతి రేసులో ఉన్నారు. వీరిలో ద్రౌపది ముర్ము, అడ్వాణీలు ముందున్నారు.

కాగా కాంగ్రెస్ దీనికి స్ట్రాంగ్ కౌంటర్ మెంబర్ ను నిలబెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు చర్చలు కూడా సోనియా జరుపుతున్నారు. ఒక వేళ గిరిజన సామాజికవర్గ ద్రౌపదిని బీజేపీ నిలబెడితే.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీ స్పీకర్ మీరాకుమార్ ను బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లేదా బీజేపీ అడ్వాణీని నిలబెడితే అందుకు ధీటుగా మహాత్మాగాంధీ మునిమనవడు గోపాలకృష్ణ గాంధీని నిలబెట్టేందుకు సోనియా గాంధీ ఆయన్ను ఒప్పించినట్టు సమాచారం..

దేశానికి స్వాతంత్ర్యం సాధించిన గాంధీ మనవడు బరిలో నిలబడితే సానుభూతి పవనాలు వీచి దేశంలో మెజార్టీ ఎమ్మెల్యే, ఎంపీలందరూ ఆయనకే ఓటు వేయడం ఖాయం. అందుకే ఇప్పుడు బీజేపీకి, మోడీకి సోనియా నిర్ణయం గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక రసకందాయంలో పడింది. బీజేపీ తరఫున ఎవరిని ఎన్నికల్లో నిలబెడతారోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది.

To Top

Send this to a friend