400 కోట్లు..

ఇది ప్రభాస్‌ ప్రస్తుత రేంజ్‌ ‘బాహుబలి’ సినిమా కోసం నాలుగు సంవత్సరాలకు పైగా కేటాయించినందకు ప్రభాస్‌కు ఫలితం దక్కింది. మొదటి పార్ట్‌తో పాటు రెండవ పార్ట్‌ సంచలన విజయాను సొంతం చేసుకోవడంతో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది. ప్రస్తుతం ప్రభాస్‌ వెంట సౌత్‌ నిర్మాతలకే కాకుండా బాలీవుడ్‌ నిర్మాతలు కూడా కోట్లు పట్టుకుని పడుతున్నారు. అయితే ప్రభాస్‌ తర్వాత సినిమా ఇప్పటికే ‘సాహో’ ఖరారు అయిన విషయం తెల్సిందే.

సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో 150 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కబోతుంది. ‘బాహుబలి 2’తో విడుదలైన టీజర్‌కు ఏ స్థాయి రెస్పాన్స్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ మిత్రులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేయబోతున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో నటించబోతుంది.

ఈ కారణంగా ‘సాహో’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ‘సాహో’ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ వారు 400 కోట్లతో కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ‘సాహో’ ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్‌ రైట్స్‌ కోసం ఈరోస్‌ ఇంత భారీ మొత్తంను నిర్మాతలకు చెల్లించబోతుంది. అంటే నిర్మాతలకు ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభించకుండా 250 కోట్ల లాభాలన్నమాట. బాలీవుడ్‌ సినిమాలకు కూడా ఈస్థాయి బిజినెస్‌ జరగదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.

To Top

Send this to a friend