ప్రభాస్ ‘సాహో’


బాహుబలి2 తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ తన సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 150 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను బాహుబలి2 సినిమాతో పాటు రిలీజ్ చేయాలని ప్రభాస్ నిర్ణయించారు. బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా 28న రిలీజ్ అవుతోంది. ఇంటర్వెల్ టైంలో ప్రభాస్ కొత్త సినిమా సాహో టీజర్ విడుదల చేస్తారు. తద్వారా ప్రభాస్ కొత్త సినిమాకు భారీ మైలేజ్ రానుంది.

ప్రభాస్ తన కొత్త సినిమా టీజర్ కోసం షూటింగ్ లో ఇటీవలే పాల్గొన్నాడట.. దాన్ని తెలుగు, తమిళం, మళయాలం, హిందీల్లో అనువదించారు. ఈ నాలుగు భాషల్లో ప్రభాస్ సాహో టీజర్ బాహుబలి 2 సినిమా మధ్యలో రిలీజ్ కానుంది.

అయితే ముందుగా అనుకున్నట్టు ఈ ఆదివారం ప్రభాస్ సాహో ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం లేదు. ఇప్పుడే రిలీజ్ చేస్తే సినిమాపై అంచనాలు తక్కువవుతాయని.. అందుకే బాహుబలి2 తోనే విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు హైప్ వస్తుందని ప్రభాస్ ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది.

To Top

Send this to a friend