ఇండియాస్‌ నెం.1 బ్రాండ్‌కు అంబాసిడర్‌గా?

ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మొబైల్‌ బ్రాండ్‌ ఏంటి అంటే అందరు ఠక్కున చెప్పే సమాధానం జియోమీ రెండ్‌ మి ఫోన్‌లు. చైనాకు చెందిన ఈ సంస్థ ఇండియాలో అత్యధిక మార్కెట్‌ను కలిగి ఉంది. పలు సంస్థలు ఈ విషయాన్ని నిర్థారించాయి. ఇండియాలో ప్రతి జియోమీ మోడల్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. దాంతో ఇండియాలో మరింతగా మార్కెట్‌ను పెంచుకునేందుకు జియోమీ ప్లాన్‌ చేస్తుంది. అందులో భాగంగానే పలువురు బ్రాండ్‌ అంబాసిడర్‌లను జియోమీ నియమించుకుంది.

సౌత్‌ ఇండియాలో భారీగా జియోమీని ప్రమోట్‌ చేసేందుకు ప్రభాస్‌ను భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఆలియా భట్‌ను ఇటీవలే ఎంపిక చేసిన జియోమి ఇంకా విరాట్‌ కోహ్లీ, దుల్కర్‌ సల్మాన్‌, శృతిహాసన్‌, దిల్జిత్‌దోశాంత్‌ వంటి వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. కోహ్లీ, ఆలియా భట్‌ల స్థాయిలో ప్రభాస్‌కు రెమ్యూనరేషన్‌ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సంవత్సరంకు గాను ఇటీవలే ప్రభాస్‌తో అగ్రిమెంట్‌ అయ్యిందంటూ జియోమీ ఇండియా ప్రకటించింది.

‘బాహుబలి’ సినిమాతో క్రేజ్‌ అమాంతం పెరిగిన ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. ప్రభాస్‌తో తమ కంపెనీలకు ప్రచారం చేయించుకునేందుకు పదుల సంఖ్యలో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. భారీ స్థాయిలో ప్రభాస్‌కు రెమ్యూనరేషన్‌ రూపంలో వస్తుంది. కాని ప్రభాస్‌ మాత్రం ఆచి తూచి బ్రాండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నాడు.

To Top

Send this to a friend