అనుష్క తో ఎఫైర్.. భయపడుతున్న ప్రభాస్..

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కోసం ముందుగా బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకోవాలనుకున్నారు. కానీ వారు హై రెమ్యూనరేషన్ అడగడంతో చివరగా అనుష్కను అనుకున్నారట.. కానీ ప్రభాస్ అనుష్కను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ఒప్పుకోలేదని సమాచారం. అనుష్క మునుపటితో పోల్చితే బరువు పెరిగి పెద్దగా కనిపిస్తోందని.. దాంతో పాటు సోషల్ మీడియాలో ప్రభాస్-అనుష్క జోడి లవ్ లో ఉందంటూ ప్రచారం జరుగుతున్న దరిమిలా ఈ సినిమాలో కూడా అనుష్క నటిస్తే ఆ ఊహాగానాలకు ఊతం ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో అనుష్కను ప్రభాసే వద్దన్నట్టు సమాచారం.

సాహో చిత్రం కోసం ముందుగా పరిణీతా చోప్రా, ఆలియాభట్, పూజాహెగ్డె, శ్రద్ధాకపూర్ .., చివరగా అనుష్క పేర్లు హీరోయిన్ పరిశీలన కోసం వచ్చాయి. అయితే ఇందులో తాజాగా శ్రద్దాకపూర్ ను సాహోలో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు తెలిసింది. శ్రద్ధా సాహోలో నటించేందుకు రెమ్యూనరేషన్ విషయంలో కాస్త తగ్గి ఒప్పుకున్నట్టు తెలిసింది. ఫిజిక్ పరంగా కూడా ప్రభాస్ కు సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెనే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుపుకుంటోంది.. ఇటీవలే సాహో విలన్ కు సంబంధించిన కొన్ని సీన్లను దర్శకుడు సుజిత్ ముంబైలో ఇటీవల చిత్రీకరించారు. ప్రబాస్ పాల్గొనే కొన్ని సీన్లను అబుదాబీ, యూరప్ లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ ఈ చిత్రం కోసం లీవ్ ఫిజిక్ తయారు చేసే పనిలో పడ్డాడట..

To Top

Send this to a friend