మహేశ్, ఎన్టీఆర్ లపై పోసాని ఏమన్నారంటే..

వాళ్లకు దేవుడు అన్ని ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. స్టేటస్ ఇచ్చాడు. ప్రజాభిమానం ఇచ్చాడు. ఇంత ఉన్నపుడు వారు అహంకారంగా ఉండాల్సిన అవసరం ఎన్టీఆర్, మహేశ్ బాబులకు లేదు అని పోసాని అన్నారు. టాలీవుడ్ వివాదాస్పద నటుడు పోసాని కృష్ణమురళి.. అగ్రహీరోలు మహేశ్, ఎన్టీఆర్ లపై చేసిన మరిన్ని కాంట్రవర్సీ కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90శాతం మంది నటులు మంచి వారని వివాదాస్పద నటుడు పోసాని కృష్ణమురళి కితాబిచ్చాడు. ఓ టీవీచానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని తెలుగు హీరోల్లో ఎవరు ది బెస్ట్ చెప్పకనే చెప్పారు. పైగా దానికి గల కారణాలను విశ్లేషించారు.

‘హీరో కృష్ణ గారిలాగానే మహేశ్ బాబు కనిపిస్తున్నారు. ఎవరి గురించి బ్యాడ్ గా మహేశ్ మాట్లాడరు.. పక్కోడు నాశనం కావాలని కోరుకోడు. మహేశ్ బాబు అహంకారంగా మాట్లాడడం నేను ఎప్పడూ చూడలేదు’ అని మహేశ్ ను పోసాని ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు.. మహేశ్ లోనే పెద్ద హీరో అనే అహం లేదని.. నేనొస్తే ఎదుటోడు లేచి నిలబడాలని అనుకోడని అన్నారు. షూటింగ్ లో ఒక ఆర్టిస్టు ఎలా ఉంటాడో.. అలాగే కుర్చీ వేసుకొని మూలన కూర్చుంటాడని చెప్పాడు. తను కూర్చుంటే ఎదుట ఇంకోడు కూర్చోకూడదు అని భావించడు. తన ఎదుట జూనియర్ ఆర్టిస్టు కూర్చున్నా పట్టించుకోడు. గుడ్ బాయ్ మహేశ్ అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

హీరో ఎన్టీఆర్ గురించి చాలా ఆసక్తికరంగా స్పందించారు.. ఇక ఎన్టీఆర్‌కు అహంకారం ఉండదు, ఫోజులు ఉండవు, నేను బాగా యాక్ట్ చేస్తే వచ్చి గట్టిగా వాటేసుకుంటాడు. బాగా చేయలేదు అంటే…. ‘అన్నా నువ్వు ఇలాగ చేస్తే బావుంటుంది’ అని చెబుతాడు.

To Top

Send this to a friend