పారితోషికం కోటి..

మొదటి సినిమాలోనే సమంత, తమన్నాల వంటి స్టార్‌ హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం మరో సారి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో రొమాన్స్‌ చేస్తున్నాడు. వరుసగా స్టార్‌ హీరోయిన్‌లతో సినిమాలు చేస్తున్న శ్రీనివాస్‌ తన తర్వాత సినిమాను పూజా హెగ్డేతో చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ తర్వాత సినిమాను శ్రీవాస్‌ దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు.

తెలుగులో ‘ముకుంద’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’ అంటూ నాగచైతన్య సరసన నటించింది. రెండు సినిమాల తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని బాలీవుడ్‌కు వెళ్లి పోయిన ఈమె తాజాగా ‘డీజే’ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. డీజే చిత్రం ఫలితం పక్కన పెడితే ఆ సినిమా ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు తెచ్చి పెడుతుంది. బెల్లకొండ శ్రీనివాస్‌తో నటించేందుకు గాను కోటి రూపాయల పారితోషికం అందుకుంటుంది.

ఇక అదే సినిమాలో లిప్‌ లాక్‌ మరియు బికినీ కోసం ఈమె అదనంగా 25 లక్షలను అందుకోబోతుంది. మొత్తానికి పూజా హెగ్డే నాల్గవ సినిమాతోనే 1.25 కోట్ల పారితోషికంగా అందుకుంటుంది. ప్రస్తుతం ముగ్గురు నలుగురు స్టార్‌ హీరోయిన్స్‌ మాత్రమే కోటి అందుకుంటున్నారు. వారితో పాటు ఈమె కూడా కోటికి పైగా అందుకుంటుంది.

To Top

Send this to a friend