సీఎం భద్రత వాహనం తనిఖీ.. చూసి పోలీసుల కళ్లు బైర్లు..

ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటన సందర్భంగా ఆయన వాహన శ్రేణిలోని కొన్ని కార్లు నంద్యాల వచ్చాయట.. అయితే వాటిపై అనుమానం వచ్చిన కొందరు వైసీపీ నాయకులు పోలీసులకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. అందులో డబ్బులు తరలిస్తున్నారన్నది వారి అభియోగం. దీంతో పోలీసులు అది సీఎం వాహన శ్రేణిలోని వాహనం అని గుర్తించకుండా వాహనం తాళం వేసి ఉన్నా కూడా పగులకొట్టి వెతికారు..

వైసీపీ నాయకులు సీఎం వాహన శ్రేణిలో ఆ వాహనంలో పెద్ద ఎత్తున డబ్బులు తరలిస్తున్నారని ఈసీకి, పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వాహనం తాళం వేసుంటే పగులకొట్టి చూశారు. అందులో ఏం దొరికిందనేది మాత్రం వెల్లడించలేదు.

కాగా సీఎం వాహన శ్రేణిలో వాహనాన్నే స్థానిక నంద్యాల పోలీసులు పగులకొట్టడం వివాదాస్పదమైంది. వైసీపీ నాయకుల ఫిర్యాదు ఆదారంగా సీఎం వాహనం తనిఖీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై ఎన్నికల తర్వాత యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

To Top

Send this to a friend