డ్రగ్స్ తో పోలీసులకు దొరక్కుండా..

డ్రగ్స్ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఇరుక్కుపోయారు. వారంతా ప్రస్తుతం పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. వారి రక్త, మూత్ర, గోళ్లు, వెంటుక్రలు నమూనాలు దర్జాగా ఇచ్చేస్తున్నారు. కానీ ఏ ఒక్క సెలబ్రెటీ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వైద్య పరీక్షల్లో తేలడం లేదట.. దీనిపై పోలీసులు తలపట్టుకుంటున్నారు. విచారణ మళ్లీ మొదటికొస్తోంది. అసలు సెలబ్రెటీల బాడీ డ్రగ్స్ అవశేషాలు ఎటుపోయాయనే ప్రశ్న ఇప్పుడు పోలీసులను వేధిస్తోంది.

ఇంతకీ డ్రగ్స్ కు దొరకకుండా సెలబ్రెటీలు ఏం చేస్తున్నారనే ప్రశ్న పోలీసులను తొలిచేస్తోంది. దీనిపై అదే ఫోరెన్సిక్ అధికారులను అడగగా.. సినీ ప్రముఖులు డ్రగ్స్ అవశేషాలు లేకుండా వివిధ చికిత్స పద్ధతులు చేయించుకుంటున్నారట.. ఏదైనా విషపదార్థాలు లోపల ఉన్నప్పుడు, ఫుడ్ పాయిజన్ అయినప్పుడు సాధారణంగా వైద్యులు డీటాక్సిఫికేషన్ చేస్తారు. దీని ద్వారా వ్యర్థాలన్నీ మలమూత్రాలు, స్వేదం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ మత్తు పదార్థాలు తీసుకున్న వారిలో అవశేషాలు చాలా రోజులు శరీరంలోనే ఉండిపోతాయి. వాటిని కూడా ఈ డీటాక్సిఫికేషన్ ద్వారా తొలగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

వీటితోపాటు శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమట ద్వారా కూడా మలినాలను పోయేలా చేసే చికిత్స అయిన స్టీమ్ బాత్, ఎఫ్ఐఆర్, కొలోన్ ప్రక్రియల ద్వారా కూడా డ్రగ్స్ అవశేషాలను తొలగించుకుంటున్నారట సెలబ్రెటీలు.. ఇక ప్రకృతివైద్యంలో భాగంగా అలవీర జ్యూస్ తాగితే శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. ఇప్పుడు సెలబ్రెటీలంతా మగ్గుల కొద్దీ జ్యూస్ తాగి వస్తున్నారట.. విచారణకు వారం ముందు నుంచే అలవీర జ్యూస్ సెలబ్రెటీలు తాగారని వైద్యులు , పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కనిపెట్టలేకపోతున్నారు.

To Top

Send this to a friend