పోలీసే రిపోర్టర్ అయ్యి ఉద్యోగం ఊడగొట్టించాడు..

మామూలుగా రిపోర్టర్లను చూసి పోలీసులు భయపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పోలీసే రిపోర్టర్ అవతారం ఎత్తాడు.. రిపోర్టర్ లా వీడియో తీస్తూ విలేకరి ఇసుక దందాను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఆ వీడియోకు సోషల్ మీడియాలో లక్ష మంది చూశారు.. వాట్సాప్ లలో చక్కర్లు కొడుతోంది.

అసలు విషయం ఏంటంటే కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చింతకుంట మనేరు వాగు నుంచి నమస్తే తెలంగాణ రిపోర్టర్ శ్రీనివాస్ తన ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ కరీంనగర్ లో అమ్ముకుంటున్నారు. రిపోర్టర్ గా పరిచయాలు ఉండడంతో ఆయన ట్రాక్టర్లను ఏ అధికారి టచ్ చేయలేదు. పైగా అధికార పార్టీ నమస్తే తెలంగాణ పత్రిక కావడంతో ఆయన ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. కానీ ఇటీవలే కానిస్టేబుల్ గా చేరిన యువకుడు చింతకుంట పోలీస్ స్టేషన్ పీసీ వాసీం ఆక్రమ్ రిపోర్టర్ కు గట్టి బుద్ది చెప్పాడు..

రిపోర్టర్ ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నాడు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన రిపోర్టర్ శ్రీనివాస్ పోలీస్ కానిస్టేబుల్ ను బెదిరించాడు. దీనికి బెదరకుండా రిపోర్టర్ ఆగడాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ కానిస్టేబుల్ . దెబ్బకు రిపోర్టర్ ఉద్యోగం ఊడిపోయింది. అతడిపై చర్యలకు దిగారు పోలీసులు. దీంతో అధికారదర్పంతో కానిది సోషల్ మీడియా ద్వారా సాధించి ఆ కానిస్టేబుల్ ఔరా అనిపించారు. కానిస్టేబులే రిపోర్టర్ గా మారి సదురు రిపోర్టర్ కు గట్టి బుద్డి చెప్పాడు.

నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఇసుక బాగోతానికి సంబంధించిన వీడియోను కింద చూడొచ్చు..

 

To Top

Send this to a friend