ఈ పనులకు పైసలివ్వండి మహాప్రభో: రాష్ట్రాలు

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, బీడీ చుట్ట, గ్రానైట్ రాయి ఏదైనా ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను.. అది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది .. డబ్బులన్నీ కేంద్రానికే పోతాయి. రాష్ట్రాల్లోని కుటీర పరిశ్రమలన్నింటిపై పన్నువేసే అధికారం జీఎస్టీ వల్ల కేంద్రానికి పోతుందట.. దీంతో రాష్ట్రాల ఖజానాలకు ఆదాయం రాదని ఐఏఎస్ లు ఘంటా బజాయించి చెబుతున్నారు.

దేశంలోని రాష్ట్రాలు, సీఎంలందరూ ఇక నుంచి ఢీల్లి వెళ్లి మోడీని శరణు వేడాల్సిందే.. ‘అయ్యా మా రాష్ట్రానికి ఇన్ని నిధులు కావాలి.. ఈ పనులకు పైసలివ్వండి మహాప్రభో’ అని ప్రాధేయ పడాల్సిందే.. ఎందుకంటే జీఎస్టీ తెస్తున్న ముప్పుతో రాష్ట్రాలకు ఆదాయం లేకుండా పోతోంది..

జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నిధుల కొరత అనివార్యం. నిధుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలందరూ మోడీని శరణువేడాల్సిందే.. జీఎస్టీతో ప్రతిదానిపై పన్ను వేసే అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం.. మోడీ భయంతో రాష్ట్రాలు ఈ నిర్ణయానికి తలూపడంతో ఈ పరిస్థితి దాపురించింది.

కానీ ఇప్పుడు తగ్గిపోతున్న ఆదాయంతో రాష్ట్రాలు, సీఎంలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 17శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతున్న తెలంగాణ సహా బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలన్నీ ఈ జీఎస్టీ అమలును తమ రాష్ట్రాల్లో వాయిదా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయట.. రాష్ట్రాల్లో పలు పన్నులపై తమకే అధికారం ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు అందరూ సీఎంలు చేసేందుకు రెడీ అయినట్టు తెలిసింది.

To Top

Send this to a friend