పిల్లలు ఆడుకుంటే రోగాలు రావు..


పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని ప్రతిరోజు ఆరుబయట పది నిమిషాలపాటు ఆడుకోనివ్వడం ఉత్తమమని చెబుతోంది తాజా అధ్యయనం. అయితే, ఆ ఆటలు ఎక్కువ శారీరక శ్రమతో కూడినవి అయి ఉండాలనీ సూచిస్తోంది. అలా ఆడితే 10 నిమిషాలపాటు పిల్లలు కఠిన వ్యాయామం చేసినట్లవుతుందని.. దీంతో వయసు పైబడ్డాక వారు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే ముప్పు తగ్గుతుందని వివరించింది.

గుండె సంబంధిత జీవక్రియలన్నీ చురుగ్గా అవుతాయని సూచించింది. లావుగా ఉన్న చిన్నారులు, రక్తంలో ఇన్సులిన్‌ స్థాయి అధికంగా ఉన్న పిల్లలకు ఈ 10 నిమిషాల ఆట మరింత మెరుగైన ప్రయోజనాలను చేకూరుస్తుందని పేర్కొంది. అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

To Top

Send this to a friend