పెళ్లి చూపులు కాంబినేషన్ 2వ సినిమా


“పెళ్లి చూపులు” చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకొన్న సరికొత్త నిర్మాణ సంస్థ “బిగ్ బెన్ సినిమాస్” తమ రెండో చిత్రాన్ని నేడు ఎనౌన్స్ చేశారు. తమ తొలి చిత్ర కథానాయకుడైన విజయ్ దేవరకొండతోనే తమ రెండో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు “బిగ్ బెన్ సినిమాస్” అధినేత యష్ రంగినేని. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయంకానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ.. “పెళ్ళిచూపులు అనంతరం మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. మునుపటి చిత్రంలో బద్దకస్తుడైన కుర్రాడిగా నటించిన విజయ్ దేవరకొండ తాజా చిత్రంలో ఇంటెన్సిటీ ఉన్న పాత్ర పోషించనున్నాడు. యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం. ఫస్ట్ లుక్ లోనే మా స్టోరీ థీమ్ ఏంటీ అనేది అర్ధమయ్యేలా చేశాడు మా డైరెక్టర్. కోపంతో రగిలిపోతున్న విజయ్ దేవరకొండను ఓ యువతి కంట్రోల్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు” అన్నారు.
నటీనటుల ఎంపిక ఇంకా జరుగుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్, కూర్పు: శ్రీజిత్ సారంగ్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, నిర్మాత: యష్ రంగినేని, రచన-దర్శకత్వం: భరత్ కమ్మ!

To Top

Send this to a friend